90Hz డిస్ప్లే, 8GB ర్యామ్‌తో భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro

Highlights

  • భారత్‌లో లాంచైన Lava Yuva 3 Pro
  • 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చిన డివైజ్
  • Lava Yuva 3 Pro ధర రూ.8,999

ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Lava నేడు భారత్ లో Lava Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. చవకైన ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి Lava Yuva 3 Pro సరైన ఎంపిక అని చెప్పవచ్చు. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Lava Yuva 3 Pro ధర, కలర్ ఆప్షన్స్

Lava Yuva 3 Pro స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్‌లైన్ రిటైలర్స్ ద్వారా Lava Yuva 3 Pro ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డెజర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్ మరియు మీడో పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
  • కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
Previous articleMediaTek Dimensity 6100+ చిప్సెట్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Realme C67 5G
Next articleIndian Gadget Awards 2023: విజేతలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.