ప్రముఖ స్వదేశీ స్మార్ట్ఫోన్ తయారీదారు Lava నేడు భారత్ లో Lava Yuva 3 Pro డివైజ్ ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో వచ్చిన ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్లైన్ రిటైలర్స్ ద్వారా ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంటుంది. చవకైన ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి Lava Yuva 3 Pro సరైన ఎంపిక అని చెప్పవచ్చు. సరే, ఓసారి Lava Yuva 3 Pro యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Lava Yuva 3 Pro ధర, కలర్ ఆప్షన్స్
Lava Yuva 3 Pro స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. లావా ఈ-స్టోర్ మరియు ఆఫ్లైన్ రిటైలర్స్ ద్వారా Lava Yuva 3 Pro ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ డెజర్ట్ గోల్డ్, ఫారెస్ట్ విరిడియన్ మరియు మీడో పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Lava Yuva 3 Pro స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Lava Yuva 3 Pro లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, పంచ్-హోల్ కటౌట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఉన్నాయి.
- ప్రాసెసర్: Lava Yuva 3 Pro లో యూనిఎస్ఓసీ టీ616 చిప్సెట్ ఉంది.
- ఓఎస్: Lava Yuva 3 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 13 ప్యూర్ ఎడిషన్ పై పని చేస్తుంది. 2 ఏళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి.
- ర్యామ్, స్టోరేజీ: Lava Yuva 3 Pro డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభించనుంది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో రానున్నట్లు సమాచారం.
- కెమెరా: Lava Yuva 3 Pro లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Lava Yuva 3 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఇతర ఫీచర్లు: Lava Yuva 3 Pro లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
