ప్రముఖ కార్ల తయారీదారు మహీంద్రా భారత్ లో Mahindra XUV400 E-SUV ని లాంచ్ చేసింది. రూ.15.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో ఈ కారు లాంచ్ అయ్యింది. Mahindra XUV400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారు మహీంద్రా యొక్క మెయిన్ స్ట్రీమ్ ప్రొడక్ట్. Tata Nexon EV Prime, Tata Nexon EV Max లను టార్గెట్ చేస్తూ వచ్చింది. అలాగే Mahindra XUV400 E-SUV భారత్ లో తయారైన ఫాస్టెస్ట్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ కారు. ఈ కారు 0 నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని 8.3 సెకన్లలో చేరుకుంటుంది. ఈ కారు టాప్ స్పీడ్ 150 కేఎంపీహెచ్.
Mahindra XUV400 E-SUV రేంజ్ 456 కిలోమీటర్లని మహీంద్రా కంపెనీ చెబుతోంది. ఈ కారు 7.2 కిలోవాట్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో వస్తోంది. అలాగే సన్‌రూఫ్, 7-ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్స్ తదితర ఫీచర్లతో Mahindra XUV400 E-SUV వస్తోంది. ఈ కారు Hyundai Kona EV, MG ZS EV కార్లతో పోటీ పడుతుంది.
Mahindra XUV400 E-SUV ధర, లభ్యత
Mahindra XUV400 E-SUV కారు భారత్ లో రూ.15.99 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో లాంచ్ అయ్యింది. ఈ కారు EC, EC 7.2kW చార్జింగ్, EL అనే మూడు వేరియంట్లలో లభించనుంది. 3.3 కిలోవాట్ చార్జింగ్ తో వచ్చిన EC మోడల్ రూ.15.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద లభిస్తుంది. ఇదే వేరియంట్ 7.2 కిలోవాట్ చార్జింగ్ తో అయితే రూ.16.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) కు లభిస్తుంది. EL వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.18.99 లక్షలుగా ఉంది. ఈ ధరలు మొదటి 5,000 బుకింగ్స్ కి మాత్రమే వర్తిస్తాయి. తర్వాత కార్ల ధరలు పెరగనున్నాయి.
Mahindra XUV400 E-SUV కారు ఆర్కిటిక్ బ్లూ, ఎవరెస్ట్ వైట్, నపొలీ బ్లాక్, ఇన్ఫినిటీ బ్లూ, గెలాక్సీ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. 2023 జనవరి 26 నుంచి Mahindra XUV400 E-SUV కారు బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఇక 2023 మార్చి నుంచి డెలివరీలు మొదలవుతాయని అంచనా వేస్తున్నారు.
Mahindra XUV400 E-SUV స్పెసిఫికేషన్స్
Mahindra XUV400 E-SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అవి: 34.5 కిలోవాట్ అవర్, 39.4 కిలోవాట్ అవర్. ఈ రెండు బ్యాటరీలు కూడా ఫ్రంట్-మౌంటెడ్ 150హెచ్‌పీ (310ఎన్ఎం) ఎలక్ట్రిక్ మోటర్ తో జతచేయబడ్డాయి. సింగిల్ చార్జ్ పై 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 375 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. మరోవైపు 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 456 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.
Mahindra XUV400 E-SUV కారు 0 నుంచి 100 కేఎంపీహెచ్ చేరుకునేందుకు 8.3 సెకన్ల సమయం తీసుకుంటుంది. కారు టాప్ స్పీడ్ 150 కేఎంపీహెచ్. ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్‌లెస్ అనే 3 డ్రైవింగ్ మోడ్స్ లో ఈ కారు లభిస్తుంది.
Mahindra XUV400 E-SUV కారు 7.2 కిలోవాట్ చార్జర్ 0 నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 6 గంటల 30 నిమిషాల సమయం తీసుకుంటుంది. 50 నిమిషాల్లో బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అవుతుంది. Mahindra XUV400 E-SUV లో 7-ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో అడ్రెనోఎక్స్ సాఫ్ట్ వేర్ వాడారు. Mahindra XUV400 E-SUV లో సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, కనెక్టెడ్ కార్ టెక్, 4 వీల్ డిస్క్ బ్రేక్స్, అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, లెదరెట్ సీట్స్ తదితర ఫీచర్లు ఈ కారులో ఉంటాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.
