హైలైట్స్:
- లాంచ్ కి ముందు రోడ్లపై కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
- రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో 150 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటర్ తో వస్తున్న ఎక్స్‌యూవీ400
- 2023 మొదట్లో మార్కెట్ లోకి రానున్న మహీంద్రా ఎక్స్‌యూవీ400
లాంచ్ కి ముందు రోడ్లపైకి టెస్ట్ రైడ్ కోసం వచ్చిన మహీంద్రా ఎక్స్‌యూవీ400 అందరి దృష్టిని ఆకర్షించింది. 2020 లో జరిగిన ఆటో ఎక్స్‌పో లో కనిపించిన మహీంద్రా ఎక్స్‌యూవీ400, 2023 మొదట్లో సేల్ కి వస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ300 బేస్ చేసుకునే లేటెస్ట్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 వస్తోంది. అయితే, పొడవు తో పాటు పలు కాస్మటిక్ చేంజెస్ ఎక్స్‌యూవీ400 ఉండనున్నట్లు సమాచారం.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఒక ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ. భారత్ లో టాటా నెక్సాన్ ఈవీ ప్రైమ్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ లతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 పోటీపడనుంది.
రోడ్లపై కనిపించిన Mahindra XUV400
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ కోసం ఆటో లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో పబ్లిక్ రోడ్లపైకి టెస్టింగ్ కి వచ్చి జనాల దృష్టిని ఆకర్షించింది మహీంద్రా ఎక్స్‌యూవీ400. చివరి దశ అభివృద్ధి పనుల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఉన్నట్లు స్పష్టమవుతోంది. 2023 మొదట్లో ఈ కారు మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. మొదటగా ఈ కారు ఆటో ఎక్స్‌పో 2020 లో తళుక్కున మెరిసింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 ని చూస్తే, సాంగ్‌యాంగ్ టివోలి మాదిరే కనిపిస్తుంది. ఎక్స్‌యూవీ300 కూడా టివోలీ ని బేస్ చేసుకుని రూపొందించినదే. ఎక్స్‌యూవీ300 కంటే ఎక్స్‌యూవీ400 పొడవుగా ఉండనుంది. 4.2 మీటర్ల పొడవుతో మహీంద్రా ఎక్స్‌యూవీ400 రానుందని సమాచారం. 4 మీటర్ బండ్లకు ప్రభుత్వం ట్యాక్స్ బెనిఫిట్ అందిస్తుండటంతో, ఎక్స్‌యూవీ300 లెంగ్త్ ని 4 మీటర్ల లోపు ఉండేట్లు తయారు చేశారు.
ఎక్స్‌యూవీ400 కారు, టివోలీ మరియు ఎక్స్‌యూవీ300 లతో పోల్చినప్పుడు వేరుగా ఉంటుంది. ప్రత్యేకించి కాస్మెటిక్స్ విషయంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ట్రాంగ్యులర్ ఫాగ్ ల్యాంప్, కంటూర్డ్ ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఔట్ గ్రిల్ ఉంటాయి. హెడ్ ల్యాంప్ క్లస్టర్ ను కూడా మార్చినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్ జత చేయబడింది. బ్రేక్స్ వంటి కొన్ని పరికరాలను చల్లబరచడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 వెనకాల టెయిల్ గేట్ పై ర్యాప్ అరౌండ్ టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఎలిమెంట్స్ తో కనిపిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్ అల్లాయ్ వీల్స్ చే ఎన్హాన్స్ చేయబడినవి. ఎక్స్‌యూవీ400 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ ని కలిగి ఉండనుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ400 సింగిల్ ఎలక్ట్రిక్ మోటర్, ఫ్రంట్ వీల్ డ్రైవింగ్, 150 బీహెచ్‌పీ పీక్ పవర్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మహీంద్రా ఎక్స్‌యూవీ400 లో అప్‌గ్రేడెడ్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ ని అందిస్తున్నారు. ఏడీఏఎస్ ఫంక్షనాలిటీస్ కోసం లేటెస్ట్ అడ్రెనాక్స్ ప్లాట్ఫామ్ ని పొందుపరిచారు.
మహీంద్రా నుంచి రానున్న రీషఫల్డ్ ఈవీ పోర్ట్ ఫోలియోకి మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎంట్రీ పాయింట్ అని చెప్పవచ్చు. అయితే, బార్న్ ఎలక్ట్రిక్ అనే ఇనీషియేటివ్ క్రింద ప్లాన్ చేసిన ఎలక్ట్రిక్ వెహికిల్స్ వరుస లో ఎక్స్‌యూవీ400 భిన్నంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే అవి గ్లోబల్ ప్రోడక్ట్స్ కాబట్టి, ప్రీమియమ్ సెగ్మెంట్ క్రిందకు వస్తాయని అంచనా.
లేటెస్ట్ ఆటోమొబైల్స్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్‌సైట్ ని ఫాలో అవ్వండి.