హైలైట్స్:
- దేశంలోని రోడ్లపై కనిపించిన మారుతి సుజుకి వ్యాగనార్ ఎలక్ట్రిక్ కార్
- మనేసర్ వద్ద గురుగ్రామ్ ప్లాంట్ దగ్గర కనిపించిన వ్యాగనార్ ఎలక్ట్రిక్ కార్
- పలు డిజైన్ మార్పులతో వస్తున్న మారుతి సుజుకి వ్యాగనార్ ఎలక్ట్రిక్ కార్
మారుతి సుజుకి ఫ్యాన్స్ కి శుభవార్త. త్వరలోనే వ్యాగనార్ ఎలక్ట్రిక్ ని మారుతి సుజుకి లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే అధిక మైలేజీ బండ్లను తయారు చేస్తూ, మార్కెట్లో మారుతి సుజుకి సంస్థ ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇక ఈవీ సెగ్మెంట్ లో కూడా ఇదే పంథాను కొనసాగించాలని మారుతి భావిస్తోంది. మారుతి సుజుకి గురుగ్రామ్ ప్లాంట్ కి దగ్గర్లో మనేసర్ వద్ద రోడ్డుపై సరికొత్త వ్యాగనార్ ఎలక్ట్రిక్ కారు కనిపించింది. ఇదివరకు కూడా వ్యాగనార్ ఎలక్ట్రిక్ కనిపించింది. కానీ ఈసారి పూర్తిగా డిజైన్ కనిపిస్తూ తారసపడింది. దీంతో ఫ్రంట్, రియర్ లుక్ ఎలా ఉంటుందో తెలిసింది.
ప్రస్తుతం ఉన్న ఐసీఈ మోడల్ తో పోల్చితే, మారుతి సుజుకి వ్యాగనార్ ఎలక్ట్రిక్ కొన్ని డిజైన్ మార్పులతో వస్తోంది. ఈవీ ఫ్యాషన్ ను అనుసరిస్తూ, ముందు గ్రిల్ ని తొలగించారు. ఇది కారుపై ఒత్తిడిని తగ్గించనుంది. హెడ్ ల్యాంప్స్ కూడా భారీ సైజు నుంచి స్లిమ్ అండ్ స్లీక్ సైజ్ కి వచ్చేశాయి. దీంతో వ్యాగనార్ కి సరికొత్త లుక్ వచ్చింది. ఫాగ్ ల్యాంప్ సెక్షన్ ను కూడా మోడిఫై చేశారు.
కొత్త టెయిల్ ల్యాంప్స్ సెట్, డిఫ్యూజర్ రియర్ బంపర్ పై అమరిన విధానం కారు రియర్ పార్ట్ కి డిఫరెంట్ లుక్ ని అందించాయి. దీంతో మొత్తంగా కారు ఎంతో స్లీకర్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఐసీఈ వర్షన్ వ్యాగనార్ మాదిరే ఈ ఎలక్ట్రిక్ కారులోని సైడ్ ప్రొఫైల్ ఉంది.
అయితే సరికొత్త వ్యాగనార్ ఎలక్ట్రిక్ కారు యొక్క ఇంటీరియర్ ఎలా ఉందో మేం చూడలేకపోయాం. అయితే, తన ఐసీఈ కౌంటర్పార్ట్ తో పోల్చితే, వ్యాగనార్ ఎలక్ట్రిక్ లో ఉత్తమమైన ఫీచర్లు ఉండటం ఖాయమని తెలుస్తోంది. ఎలక్ట్రిక్ కారు కాబట్టి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉండే అవకాశముంది.
మరి ఈ కారు భారత్ లో ఎప్పుడు లాంచ్ కానుందన్నదే ప్రధాన ప్రశ్న. వేరే ఇతర మారుతి సుజుకి కారైతే, లాంచ్ తేదీ గురించి కచ్చితంగా ఏదైనా అంచనా వేయగలం. అయితే ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి ఏమీ చెప్పలేకపోతున్నాం. తన తొలి ఎలక్ట్రిక్ కారుని భారత్ లో 2025 లో లాంచ్ చేయబోతున్నట్లు మారుతి చెబుతోంది. ఇంకా మూడేళ్ళ సమయం ఉంది కావున, మనేసర్ వద్ద రోడ్లపై కనిపించిన మోడల్ ని తుది నమూనాగా పరిగణించలేం. దీని కంటే అప్డేటెడ్ వర్షన్ వచ్చే అవకాశం కూడా ఉంది. రానున్న రోజుల్లో మారుతి కంపెనీ నుంచి వ్యాగనార్ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించిన ఏవైనా టీజర్ ఇమేజెస్, స్పెసిఫికేషన్స్, ఇతర సమాచారం బయటకు వచ్చే అవకాశముంది. అప్పుడు మరిన్ని వివరాలు మనకు తెలుస్తాయి.
లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.













