Microsoft Rewards: Bing సెర్చ్ ఉపయోగించడం ద్వారా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ గెలుచుకోవచ్చు; ఎలాగో తెలుసుకోండి

హైలైట్స్

  • జనాలను బింగ్ సెర్చ్ వైపు మళ్ళించేందుకు మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ ప్లాన్
  • Bing సెర్చ్ ని ఉపయోగించడం ద్వారా లభించనున్న రివార్డ్ పాయింట్లు
  • పాయింట్లను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డులుగా రిడీమ్ చేసుకునే అవకాశం

తన సొంత బ్రౌజర్ అయిన Edge మరియు సెర్జ్ ఇంజిన్ Bing యూజర్ బేస్ ని పెంచేందుకు Microsoft కొత్త మార్గాన్ని ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ అనే స్కీమ్ ని తొలుత యూఎస్ కే పరిమితం చేసినప్పటికీ, తాజాగా ఈ రివార్డ్స్ ప్రోగ్రామ్ ని భారత్ కి కూడా తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అందిస్తోన్న బింగ్ సెర్చ్ ఇంజిన్ పై మీకు కావాల్సిన సమాచారాన్ని వెతకడం మరియు ఇతర పనుల ద్వారా కొంత డబ్బుని సంపాదించుకోవచ్చు. మీరు గెలుచుకున్న పాయింట్లను అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు.

తొలుత ఈ డీల్ ని Desidime యూజర్ పసిగట్టారు. ఆ తర్వాత ఈ విషయాన్ని పలువురు కన్ఫర్మ్ చేశారు. మరి మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ ద్వారా అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ ని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. అంత కంటే ముందే అసలు మైక్రోసాఫ్ట్ రివార్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం.

Microsoft Rewards అంటే ఏంటి?

Microsoft Rewards పూర్తిగా ఉచిత కార్యక్రమం. దీని ద్వారా మీ రోజువారీ యాక్టివిటీస్ ద్వారా సముపార్జన చేయవచ్చు. మీరు ఎప్పుడైతే Bing పై సెర్చ్ చేస్తారో, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి ఏదైనా కొనుగోలు చేస్తారో లేదా పోల్స్/క్విజెస్ లో పాల్గొంటారో.. అప్పుడు మీరు రివార్డ్ పాయింట్లను సంపాదిస్తారు. వీటిని మీరు ఏదైనీ కచ్చితమైన బ్రాండ్ యొక్క గిఫ్ట్ కార్డ్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా కేవలం సైన్ ఇన్ అయి సెర్చ్ చేయడమే.

విండోస్ 10 లేదా ఆ పైన వచ్చిన ఓఎస్ పై మాత్రమే Microsoft Rewards ప్రోగ్రామ్ పని చేస్తుంది. ఇంతకు ముందు ఈ రివార్డ్స్ స్కీమ్ పేరు బింగ్ రివార్డ్స్ అని ఉండేది. మీరు చేసిన ప్రతి సెర్చ్ కి మూడు పాయింట్లు మీ యొక్క రివార్డ్స్ ఖాతాకు జమ అవుతాయి.

మీకు లేదా మీ సంబంధీకులకు Xbox console ఉంటే గనుక మీరు కన్సోల్ పై కొన్ని టాస్క్ లను పూర్తి చేయడం ద్వారా పాయింట్లను సంపాదించవచ్చు.

Microsoft నుంచి అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ పొందడం ఎలా?

మైక్రోసాఫ్ట్ నుంచి అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ గిఫ్ట్ కార్డ్స్ గెలుచుకునేందుకు మీరు Microsoft Rewards పై పాయింట్లను సంపాదించాల్సి ఉంటుంది. అందుకోసం మీరు Microsoft Rewards వెబ్‌సైట్ పై ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అంటే, ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఓపెన్ చేసి రిజిస్టర్డ్ అకౌంట్ తో లాగ్ ఇన్ అవ్వాలి.

పాయింట్లను త్వరగా సంపాదించాలంటే, మీరు మీ డిఫాల్ట్ బ్రౌజర్ ని గూగుల్ నుంచి బింగ్ కి మార్చుకోవాలి. మైక్రోసాఫ్ట్ బింగ్ పై మీరు చేసే ప్రతి సెర్చ్ కి పాయింట్లు లభిస్తాయి. 400 పాయింట్లు పొందాక మీరు రూ.25 విలువగల అమెజాన్ లేదా ఫ్లిప్ కార్ట్ వోచర్ ని సొంతం చేసుకోవచ్చు. ప్రతి రోజు మీరు కేవలం 33 పాయింట్లు మాత్రమే గెలవగలరు. అంటే, రమారమీ 13 రోజులకు మీకు వోచర్ లభిస్తుంది.

మీరు మైలురాయిని చేరుకున్నాక, వాటిని రిడీమ్ చేసుకోవాలి. అప్పుడు మీకు మైక్రోసాఫ్ట్ నుంచి గిఫ్ట్ వోచర్ తో పాటు ఓ మెయిల్ వస్తుంది. మీరు గనుక వోచర్ ని తీసుకోవద్దనుకుంటే అమౌంట్ ని చారిటీకి డొనేట్ చేయవచ్చు.

ప్రతిరోజూ బింగ్ సెర్చ్ వాడే వారికి అదనపు ప్రయోజనం ఉంది. మీరు ప్రతిరోజు వాడితే తదుపరి లెవెల్ కి చేరుకునే అవకాశం ఉంది. అంటే లెవెల్ 2 కి చేరుకుంటారన్న మాట. అప్పుడు మీరు ప్రతిరోజు 100 పాయింట్లు గెలుచుకోవచ్చు. అంటే కేవలం 4 రోజుల్లో మీరు వోచర్ ని సొంతం చేసుకోవచ్చు.

మీకు షాపింగ్ చేయడం ఇష్టం లేకపోతే, మీరు గెలుచుకున్న 4000 పాయింట్లను రిడీమ్ చేసుకొని రూ.250 విలువజేసే BookMyShow గిఫ్ట్ కార్డ్ సొంతం చేసుకోవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.