Home News ఫిబ్రవరి 8 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13

ఫిబ్రవరి 8 న భారత్‌లో లాంచ్ అవుతోన్న Moto E13

Highlights
  • భారత్ లో ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతోన్న Moto E13 స్మార్ట్ ఫోన్
  • 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోన్న Moto E13 డివైజ్
  • భారత్ లో Moto E13 ధర రూ.10,000 లోపు ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Moto E13 భారత్ లో ఫిబ్రవరి 8 న లాంచ్ అవుతున్నట్లు సమాచారం. ఈ బడ్జెట్ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Moto E13 ఫోన్ సింగిల్ స్టోరేజీ వేరియంట్ లో లాంచ్ అవుతుందని రివీల్ చేశాడు. భారత్ లో ఈ డివైజ్ అరోరా గ్రీన్ కలర్ ఆప్షన్ లో లభించనుంది. సరే, ఓసారి Moto E13 ఇండియా ప్రైస్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలను తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto E13 లాంచ్ తేదీ, ధర

Moto E13 ధర భారత్ లో రూ.10,000 లోపే ఉంటుందని సమాచారం. అసలైన ధరను వచ్చే వారం ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ ఫోన్ ధర యూరప్ మార్కెట్ లో 120 యూరోలు (సుమారు రూ.10,670) గా ఉంది. ఇది 2జిబి ర్యామ్ వేరియంట్ ధర. భారత్ లో Moto E13 ధర ఇంతకంటే తక్కువగానే ఉండవచ్చని అంచనా.

Moto E13 స్పెసిఫికేషన్స్

Moto E13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ హెచ్డీ+ డిస్ప్లేతో వస్తోంది. ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ప్యానెల్ ని అందించారు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్ కలిగి ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Moto E13 స్మార్ట్ ఫోన్ లో యూనిసాక్ టీ606 ప్రాసెసర్ ని వాడారు. ఇదొక ఎంట్రీ లెవెల్ చిప్సెట్. ఈ డివైజ్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 64జిబి స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకోవచ్చు.

Moto E13 స్మార్ట్ ఫోన్ 4జీ కనెక్టివిటీతో వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ (గో ఎడిషన్) పై పని చేస్తుంది. సింగిల్ రియర్ కెమెరా సెటప్ తో ఈ ఫోన్ వస్తోంది. 13ఎంపి మెయిన్ కెమెరాను ఈ ఫోన్ లో అందించారు. దీనికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి కెమెరా ఇచ్చారు.

Moto E13 స్మార్ట్ ఫోన్ ధర రూ.10,000 లోపే ఉండనుంది. Moto E13 ఫోన్ రెడ్మీ ఏ1+, పోకో సీ50, రియల్మీ సీ33 వంటి ఫోన్లతో పోటీపడనుంది. త్వరలోనే ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడు మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.