13ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో భారత్‌లో లాంచైన Moto e13

Highlights

  • నేడు భారత్ లో లాంచైన Moto e13 స్మార్ట్ ఫోన్
  • 13ఎంపి రియర్ కెమెరా, 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 10 వాట్ చార్జింగ్ తో వచ్చిన Moto e13
  • భారత్ లో Moto e13 2జిబి + 64జిబి వేరియంట్ ధర రూ.6,999

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా భారత్ లో ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ Moto e13 ని లాంచ్ చేసింది. కొన్ని వారాల క్రితం Moto e13 ఫోన్ యూనిసాక్ ప్రాసెసర్ తో గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. లేటెస్ట్ ఈ-సిరీస్ స్మార్ట్ ఫోన్ భారీ డిస్ప్లే, వాటర్ డ్రాప్ నాచ్, హెచ్డీ+ రెజుల్యూషన్ తో వచ్చింది.

Moto e13 స్మార్ట్ ఫోన్ 13ఎంపి కెమెరా, 5ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ పోర్ట్ తో లాంచ్ అయ్యింది. Moto e13 లో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అయితే, ఫేస్ అన్ లాక్ ఫీచర్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. సరే, ఓసారి Moto e13 ఇండియా ప్రైస్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, లభ్యత గురించి తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto e13 ధర, లభ్యత

Moto e13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ధర రూ.6,999 గా ఉంది. ఈ హ్యాండ్సెట్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్ లో కూడా లభించనుంది. దీని ధర రూ.7,999 గా ఉంది. Moto e13 ఫోన్ ఫిబ్రవరి 15 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Moto e13 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Moto e13 స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ (720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్), 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ తో వచ్చింది.

Moto e13 స్మార్ట్ ఫోన్ యూనిసాక్ టీ606 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూని కలిగి ఉంది. 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఫోన్ లో అందించారు. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ గో ఎడిషన్ పై పని చేస్తుంది. భవిష్యత్తులో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ రిసీవ్ చేసుకుంటుందా లేదా అనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు.

Moto e13 స్మార్ట్ ఫోన్ లో 13ఎంపి రియర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. లేటెస్ట్ ఈ-సిరీస్ స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. డెడికేటెడ్ మైక్రోఎస్డీ కార్డ్, టైప్-సీ పోర్ట్ ఈ ఫోన్ లో అందించారు. 3.5ఎంఎం ఆడియో జాక్ కూడా ఈ ఫోన్ లో ఉంది. ఇంకా డాల్బి అట్మాస్ ఆడియో సపోర్ట్ తో ఈ ఫోన్ రావడం విశేషం.

Moto e13 స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 164.19 మిల్లీ మీటర్ల పొడవు, 74.95 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.47 మిల్లీ మీటర్ల మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ52 ఫ్లాష్ రేటింగ్ తో వస్తోంది. డ్యూయల్-సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleభారత్‌లో లాంచైన OnePlus TV 65 Q2 Pro, OnePlus Keyboard 81 Pro
Next articleAirtel రూ.499 ప్లాన్: 3GB డెయిలీ డేటా, Disney+ Hotstar Mobile తో పాటు మరెన్నో బెనిఫిట్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.