Home News UniSoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Moto e13

UniSoc ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Moto e13

హైలైట్స్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఈ-సిరీస్ లో ఓ కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది. Moto e13 అనే ఈ ఎంట్రీ లెవెల్ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. Pricebaba తొలుత Moto e13 ని బెంచ్ మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్ డేటాబేస్ పై గుర్తించింది. గీక్ బెంచ్ డేటాబేస్ లిస్టింగ్ ద్వారా Moto e13 కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

లిస్టింగ్ ని గమనిస్తే, Moto e13 యూనిసాక్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోంది. Moto e13 యొక్క మరిన్ని విశేషాలను ఇక్కడ తెలుసుకుందాం.

Moto e13 స్మార్ట్ ఫోన్ గీక్ బెంచ్ 5 బెంచ్ మార్క్ డేటాబేస్ పై కనిపించింది. ఈ అప్‌కమింగ్ ఈ-సిరీస్ సింగిల్ కోర్ టెస్ట్ లో 318 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 995 పాయింట్లు సాధించింది. Moto e13 యూనిసాక్ ప్రాసెసర్ తో వస్తోంది. ఈ ప్రాసెసర్ 1.61 గిగాహెర్టజ్ పీక్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటుంది.

Moto e13 యూనిసాక్ టీ606 చిప్సెట్ ని కలిగి ఉండనుంది. ఈ చిప్ 12ఎన్ఎం ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఇందులో మాలి జీ57 జీపీయూ వాడారు. ఇదే ప్రాసెసర్ ని నోకియా జీ11, నోకియా జీ21, టెక్నో స్పార్క్ 8సీ, శాంసంగ్ గెలాక్సీ ఏ03 మరియు మోటో ఈ32 (గ్లోబల్ వేరియంట్) వంటి ఎంట్రీ ఫోన్లలో వాడారు.

Moto e13 స్మార్ట్ ఫోన్ 2జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలిసింది. కంపెనీ ఈ ఫోన్ ని ఇతర మెమొరీ ఆప్షన్స్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలో లాంచ్ కానున్న Moto e13 ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తుండటం విశేషం. ఎంట్రీ లెవెల్ ఫోన్ లో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఓఎస్ ని అందిస్తుండటం మంచి విషయం.

Moto e32 స్పెసిఫికేషన్స్

Moto e32 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్, యూనిసాక్ టీ606 ప్రాసెసర్, మాలి జీ57 జీపీయూ, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఉంటాయి.

Moto e32 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్, 2ఎంపి మ్యాక్రో లెన్సెస్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇంకా పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఐపీ-52 రేటింగ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఈ ఫోన్ లో ఉంటాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.