హైలైట్స్:
- మోటోరోలా నుంచి వస్తోన్న మరో బడ్జెట్ ఫోన్ Moto E22
- ఈ వారంలో గ్లోబల్ గా లాంచ్ కానున్న Moto E22
- Moto E22 మల్టీపుల్ కలర్ ఆప్షన్స్ తో వస్తుందని తెలియజేస్తున్న రెండర్స్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola నిన్నే Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను భారత్ లో లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ Moto E22, Moto E22i అనే రెండు బడ్జెట్ ఫోన్లను తీసుకొస్తున్నట్లు సమాచారం.
ప్రైస్ బాబా ప్రచురించిన కథనంలో, Moto E22 సెప్టెంబర్ 16 న లాంచ్ కానుందని టిప్‌స్టర్ పారస్ గుగ్లాని చెప్పినట్లు పేర్కొనబడింది. ఈ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండే అవకాశముంది. ఇదే కాకుండా, గుగ్లాని Moto E22 యొక్క రెండర్ ఇమేజెస్ ని కూడా షేర్ చేశాడు. Moto E22 మూడు రంగుల్లో లభ్యం కానుందని ఈ ఇమేజెస్ ద్వారా స్పష్టమైంది. ఆ రంగులు: షేడ్ ఆఫ్ లైట్ బ్లూ, షేడ్ ఆఫ్ నేవీ. ఇంతకు ముందు 91మొబైల్స్ హిందీ షేర్ చేసిన Moto E22 ఇమేజెస్ ఫోన్ ని గ్రే కలర్ లో చూపించాయి.
రెండర్స్ ని బట్టి ఫోన్ గ్లాస్ (Gloss) బ్యాక్ ప్యానెల్, డ్యూయల్ రియర్ కెమెరా ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ప్యానెల్ బాటమ్ లో మోటోరోలా బ్రాండింగ్, మధ్యలో లోగో కనిపిస్తున్నాయి. రెండర్స్ ద్వారా ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్, వాటర్ డ్రాప్ నాచ్, మందపాటి చిన్ కలిగి ఉన్నట్లు అర్థమవుతోంది.
Moto E22 స్పెసిఫికేషన్స్ (అంచనా)
Moto E22 బడ్జెట్ ధరలో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే ఫోన్ గురించి ఎక్కువ సమాచారం తెలియలేదు. అయితే ఈ ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండనుందని తెలుస్తోంది. Moto E22 లో మీడియాటెక్ హీలియో చిప్సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశముందని గతంలో వచ్చిన రూమర్ల ద్వారా తెలుస్తోంది. Moto E22 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ తో వచ్చే చాన్సెస్ ఉన్నాయి. Moto E22 లో 3.5ఎంఎం ఆడియో జ్యాక్ ఉండనుంది. అలాగే డాల్బి అట్మాస్ కూడా ఉంటుందని సమాచారం.
మంగళవారం నాడు మోటోరోలా తన ఫ్లాగ్షిప్ ఫోన్స్ Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion లను భారత్ లో లాంచ్ చేసింది. Moto Edge 30 Ultra ప్రపంచపు తొలి 200ఎంపి ఫోన్ గా పరిగణించబడుతోంది. ఇక Moto Edge 30 Fusion క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ని కలిగి యూజర్లను ఆకర్షిస్తోంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఈ రెండు ఫోన్లను డిస్కౌంట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం మోటోరోలా ఈ డివైజెస్ పై ఇంట్రడక్టరీ ప్రైస్ ని ఆఫర్ చేస్తోంది. కాబట్టి, ఆసక్తి గల వారు త్వరగా ఈ ఫోన్లను కొనుక్కుంటే మంచిది. లేదంటే, మళ్ళీ ధరలు పెరిగే అవకాశముంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.