Moto E22s ఫస్ట్ సేల్: నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయం

హైలైట్స్

  • నేటి నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా Moto E22s అమ్మకాలు షురూ
  • మీడియాటెక్ జీ37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999

ఈ వారం ఆరంభంలో Moto e22s స్మార్ట్ ఫోన్ ని మోటోరోలా కంపెనీ భారత మార్కెట్ లో ప్రవేశపెట్టింది. కాగా, నేడు ఈ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ కి వచ్చింది. ఈ లేటెస్ట్ Moto e22s స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ జీ37 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో పంచ్-హోల్ నాచ్, 16ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి.

Moto e22s స్మార్ట్ ఫోన్ లో 5000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఎంట్రీ-లెవెల్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ ఇది ఫింగర్ ప్రింట్ స్కానర్, టైప్-సీ చార్జింగ్ పోర్ట్ కలిగి ఉంది. భారత్ లో Moto e22s ధర, లాంచ్ ఆఫర్స్, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి మరింతగా తెలుసుకుందాం పదండి.

భారత్ లో Moto e22s ధర, లభ్యత

Moto e22s 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో లభిస్తుంది. దీని ధరను రూ.8,999 గా నిర్ణయించారు. Moto e22s స్మార్ట్ ఫోన్ ని అక్టోబర్ 22 నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto e22s బయ్యర్స్ గూగుల్ నెస్ట్ హబ్ (సెకండ్ జనరేషన్) మరియు గూగుల్ నెస్ట్ మిని (సెకండ్ జనరేషన్) ని వరుసగా రూ.3,999 మరియు రూ.1,499 లకే సొంతం చేసుకోవచ్చు.

Moto e22s స్పెసిఫికేషన్స్

Moto e22s లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 268పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, సెంటర్డ్ పంచ్ హోల్ నాచ్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్ ని అమర్చారు. ఈ చిప్ పవర్ వీఆర్ జీఈ8320 జీపీయూ తో ఇంటిగ్రేడ్ చేయబడి ఉంది. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. అయితే మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

Moto e22s యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto e22s లో 16ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి తోడు 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో ముందువైపున 8ఎంపి కెమెరాను అమర్చారు.

Moto e22s లో పవర్ బ్యాకప్ కోసం 5000ఎంఏహెచ్ బ్యాటరీ యూనిట్ ని అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అమర్చారు. ఇది పవర్ బటన్ లో ఎంబెడ్ అయి ఉంటుంది.

Moto e22s ఆర్కిటిక్ బ్లూ, ఇకో బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంటుంది. Moto e22s స్మార్ట్ ఫోన్ 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 74.94 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ హ్యాండ్సెట్ ఐపీ52 రేటింగ్ తో రావడం వల్లన ఇది చిరుజల్లులను తట్టుకుని నిలుస్తుంది. Moto e22s ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్స్ అలాగే రెండేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ని మోటోరోలా హామి ఇస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleSnapdragon 8 Gen 2 చిప్సెట్, 200W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న iQOO 11 Pro
Next articleలీకైన Samsung Galaxy A14 డిజైన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.