అక్టోబర్ 17 న భారత్ లో లాంచ్ కానున్న Moto E22s

హైలైట్స్

  • 2022 అక్టోబర్ 17 న Moto E22s భారత్ లో లాంచ్ అవుతుందని అంచనా
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానున్న Moto E22s
  • ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనున్న Moto E22s స్మార్ట్ ఫోన్

Motorola ప్రస్తుతం Moto E22s అనే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రీమియమ్ డిజైన్ తో వస్తోన్న ఈ ఫోన్ అక్టోబర్ 17 న లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా బయటకు వచ్చిన లీక్స్ ని బట్టి ఈ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆండ్రాయిడ్ 12 ప్లాట్ఫామ్ పై పని చేయనుందని తెలుస్తోంది. ఇకపోతే, ఈ నెల మొదట్లో మోటోరోలా కంపెనీ మోటో ఈ32, మోటో జి37 స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది.

లాంచ్ కి ముందు లీకైన Moto E22s స్పెసిఫికేషన్స్

2022, అక్టోబర్ 17 న Moto E22s స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ ద్వారా Moto E22s యొక్క స్పెసిఫికేషన్స్ ని లీక్ చేశాడు. మరి ఆ స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Moto E22s స్మార్ట్ ఫోన్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లే తో వస్తోంది. ఈ ఫోన్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ని అందించారు. ఈ ఫోన్ ఐపీ52 వాటర్ ప్రూఫింగ్ తో వస్తోంది. గత నెలలో Moto E22s యూరోపియన్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ లో ఈ ఫోన్ లభించనుంది.

Moto E22s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 16 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 5 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. Moto E22s లో 4,020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto E22s స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తోంది. ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. హోల్-పంచ్ కటౌట్ ని సెంటర్ లో అందించారు. ఇందులో కెమెరా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్ బయ్యర్ ని టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ని తీసుకొస్తున్నారు.

యూరోప్ మార్కెట్స్ లో Moto E22s ధర 139.99 యూరోలు (సుమారు రూ.11,000) గా ఉంది. భారత మార్కెట్ లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందో ఇంకా తెలియదు. లాంచ్ రోజున పూర్తి వివరాలు తెలుస్తాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleMediaTek Helio A22 చిప్, 5,000mAh బ్యాటరీతో భారత్ లో లాంచ్ అయిన Redmi A1+
Next article64MP కెమెరా, 6000mAh బ్యాటరీతో లాంచ్ అయిన Samsung Galaxy M32 Prime Edition
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.