హైలైట్స్
- భారత్ లో లాంచ్ అయిన Moto E22s బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్
- 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- భారత్ లో Moto E22s ధర రూ.8,999
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా తాజాగా Moto E22s అనే బడ్జెట్ ఫోన్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ వాటర్ డ్రాప్ నాచ్ లో సెల్ఫీ కెమెరా, మందపాటి బాటమ్ బెజెల్, రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ తో వస్తోంది. రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ లో రెండు సెన్సర్స్ ఉంటాయి. ఫోన్ బ్యాక్ ప్యానెల్ గ్రేడియంట్ డిజైన్, గ్లాసీ ఫినిష్ తో యూనిక్ గా కనిపిస్తోంది. భద్రత కోసం ఫోన్ లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. డాల్బీ అట్మాస్, వాటర్ రిపెల్లంట్ డిజైన్ ని ఈ ఫోన్ కలిగి ఉంది.
6.5-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 16 ఎంపి మెయిన్ కెమెరా, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ చార్జింగ్ వంటి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వస్తోంది.
భారత్ లో Moto E22s ధర, లభ్యత
భారత్ లో Moto E22s 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 గా ఉంది. ఇది ఇకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ తో లభించనుంది. ఫ్లిప్ కార్ట్ తో పాటు ప్రముఖ రిటైల్ స్టోర్స్ లో అక్టోబర్ 22 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ అమ్మకాలు మొదలవుతాయి. లాంచ్ ఆఫర్ లో భాగంగా రూ.2,000 జియో రీచార్జ్ క్యాష్ బ్యాక్ మరియు జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్ కలుపుకుని మొత్తం రూ.2.549 బెనిఫిట్స్ ని మోటోరోలా అందిస్తోంది.
Moto E22s స్పెసిఫికేషన్స్
Moto E22s లో 6.5-ఇంచ్ హెచ్డీ+ మ్యాక్స్‌విజన్ డిస్ప్లే, 1600*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ ని ఈ ఫోన్ లో అమర్చారు. ఐఎంజీ పవర్‌వీఆర్ జీఈ8320 జీపీయూ ని గ్రాఫిక్స్ కోసం వాడారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 512జిబి వరకు ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చు. Moto E22s ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
డ్యూయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, బ్లూటూత్ 5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ Moto E22s లో ఉన్నాయి. ఈ ఫోన్ వాటర్-రిపెల్లెంట్ డిజైన్ తో వస్తోంది. Moto E22s లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. డాల్బి అట్మాస్, స్టీరియో స్పీకర్స్, ఎఫ్ఎం రేడియో, 3.5ఎంఎం ఆడియో జాక్, 4020 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. బ్యాటరీ 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Moto E22s స్మార్ట్ ఫోన్ 163.95 మిల్లీ మీటర్ల పొడవు, 74.94 మిల్లీమీటర్ల వెడల్పు, 8.49 మిల్లీ మీటర్ల మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.
ఇప్పుడు Moto E22s కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto E22s లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 16ఎంపి మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చారు.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












