Home News రిటైల్ బాక్స్ ద్వారా లీకైన Moto Edge 30 Fusion ధర, స్పెసిఫికేషన్స్

రిటైల్ బాక్స్ ద్వారా లీకైన Moto Edge 30 Fusion ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్:

సెప్టెంబర్ 8 న కొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు మోటోరోలా రెడీ అవుతోంది. వీటిలో మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఫోన్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క బాక్స్ ప్యాకేజ్, లైవ్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. ప్రైస్ బాబా రిపోర్ట్ ద్వారా ఇవి బయటకు వచ్చాయి. ఇమేజ్ ద్వారా బాక్స్ డిజైన్, ముఖ్యమైన స్పెసిఫికేషన్స్, ధర వివరాలు తెలిశాయి. ఫోన్ కోసం ఇకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్ వాడినట్లు అర్థమవుతోంది. ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ ద్వారా బ్యాక్ ప్యానెల్ కనిపిస్తోంది.

మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ రిటైల్ బాక్స్ పై రూ.49,999 ధర కనిపిస్తోంది. అలాగే ఈ బాక్స్ ప్యాకేజీ ద్వారా ఫోన్ లభ్యమయ్యే రంగుల్లో ఒకటి కన్ఫర్మ్ అయ్యింది.

 

Moto Edge 30 Fusion ధర

రేపటి లాంచ్ కి ముందే మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ యొక్క బాక్స్ డిజైన్ రివీల్ అయ్యింది. బాక్స్ బ్రౌన్ కలర్ లో ఉండటం మనం గమనించవచ్చు. అలాగే బాక్స్ ద్వారా కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ తెలుస్తున్నాయి. ఈ హ్యాండ్సెట్ 4400 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. అలాగే 8జిబి + 128జిబి సింగిల్ వేరియంట్ లో ఫోన్ లభిస్తుంది. హ్యాండ్సెట్ కాస్మిక్ గ్రే కలర్ లో లభించనుంది. అయితే ఇతర కలర్ ఆప్షన్స్ ఏంటో లాంచ్ రోజున తెలుస్తుంది. బాక్స్ పై రూ.49,999 గా ధర ఉంది. అయితే దీని కంటే తక్కువ ధరకే ఫోన్ లభించే అవకాశముంది.

లైవ్ ఇమేజ్ ని బట్టి, Moto Edge 30 Fusion గ్రే కలర్ ఆప్షన్ లో లభించనుంది. బ్యాక్ ప్యానెల్ పై ఐకానిక్ మోటోరోలా లోగో కనిపిస్తోంది. ఇక స్క్వేర్ కెమెరా మాడ్యూల్ పై ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. మోటో ఎస్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ గా Moto Edge 30 Fusion వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మోటో ఎస్30 ప్రో రీసెంట్ గా చైనాలో లాంచ్ అయ్యింది. ఇదే కనుక నిజమైతే, మనకు స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసనే చెప్పాలి. పదండి వాటిపై ఓ కన్నేద్దాం.

Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Fusion 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్ హోల్ కటౌట్ ఇందులో ఉంటాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్, 12జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 4400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు Moto Edge 30 Fusion లో ఉన్నాయి.

Moto Edge 30 Fusion మూడు రియర్ కెమెరాలను కలిగి ఉంది. వీటిలో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ (ఓఐఎస్), 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32ఎంపి కెమెరా ఉంటుంది. ఇకపోతే ఫోన్ భద్రత కొరకు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.