హైలైట్స్
- భారత మార్కెట్ లో లాంచైన Moto Edge 30 Fusion Viva Magenta స్పెషల్ ఎడిషన్
- మజెంటా కలర్ లో వస్తోన్న మోటోరోలా యొక్క తొలి ఫోన్ Moto Edge 30 Fusion Viva Magenta
- రూ.39,999 ఇంట్రడక్టరీ ధరతో భారత్ లో లాంచైన Moto Edge 30 Fusion Viva Magenta
2022 సెప్టెంబర్ లో భారత్ లో Moto Edge 30 Fusion ఫోన్ లాంచైంది. ఎడ్జ్ లైనప్ లో వచ్చిన ఈ మిడ్ రేంజ్ ఫోన్ కాస్మిక్ గ్రే మరియు సోలార్ గోల్డ్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, కంపెనీ Moto Edge 30 Fusion Viva Magenta స్పెషల్ ఎడిషన్ ని భారత్ లో లాంచ్ చేసింది. ఈ కలర్ లో కంపెనీ నుంచి వస్తోన్న తొలి ఫోన్ ఇదేనని మోటోరోలా చెబుతోంది. కలర్ తప్పితే స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ టు సేమ్.
Moto Edge 30 Fusion Viva Magenta స్పెషల్ ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 50ఎంపి కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 4400ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వచ్చింది.
భారత్ లో ‘మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా మజెంటా’ స్పెషల్ ఎడిషన్ ధర, లభ్యత
భారత్ లో Moto Edge 30 Fusion Viva Magenta స్పెషల్ ఎడిషన్ యొక్క ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.39,999 గా ఉంది. ఒరిజినల్ ప్రైస్ 8జిబి + 128జిబి వేరియంట్ కి రూ.42,999 గా ఉంది. జనవరి 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ సేల్ కి వస్తోంది. లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ కి ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా జియో కస్టమర్లకు రూ.7,699 విలువజేసే బెనిఫిట్స్ లభిస్తాయి.
‘మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ వివా మజెంటా’ స్పెసిఫికేషన్స్
Moto Edge 30 Fusion లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డీసీ డిమ్మింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, పంచ్ హోల్ కటౌట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్, అడ్రెనో 660 జీపీయూ, 8జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉన్నాయి.
ఇప్పుడు Moto Edge 30 Fusion యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ఫీచర్ కలిగి ఉంది. అలాగే 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అల్ట్రావైడ్ లెన్స్, మ్యాక్రో ఆప్షన్ ని కలిగి ఉంది. ఇక మూడో కెమెరాగా 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంది. ఇప్పుడు Moto Edge 30 Fusion బ్యాటరీ విభాగం పై ఓ కన్నేద్దాం పదండి. Moto Edge 30 Fusion లో 4,400 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై ఈ ఫోన్ పని చేస్తుంది.
5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వోల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇంకా Moto Edge 30 Fusion లో స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.