Home News గ్లోబల్ గా లాంచ్ అయిన Moto Edge 30 Neo

గ్లోబల్ గా లాంచ్ అయిన Moto Edge 30 Neo

హైలైట్స్:

మోటోరోలా కంపెనీ మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ మరియు మోటో ఎడ్జ్ 30 నియో ఫోన్లను గ్లోబల్ గా లాంచ్ చేసింది. త్వరలోనే ఈ డివైజెస్ భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్నాయని సమాచారం. ఈ రెండు ఫోన్లు, మోటో ఎడ్జ్ 30 అల్ట్రా తో పాటు లాంచ్ అయ్యాయి. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లో 200ఎంపి భారీ కెమెరా ఉంది. ఇప్పుడు మోటో ఎడ్జ్ 30 నియో గురించి తెలుసుకుందాం. పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ కెమెరాస్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Moto Edge 30 Neo ధర

Moto Edge 30 Neo ధర 369.99 యూరోలు (దాదాపు రూ.29,700). ఈ ఫోన్ నాలుగు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: వెరీ పెరీ, ఆక్వా ఫోమ్, బ్లాక్ ఒనిక్స్, ఐస్ ప్యాలెస్. త్వరలోనే ఈ హ్యాండ్సెట్ అందుబాటులోకి వస్తుంది.

Moto Edge 30 Neo స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Neo 6.28-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ని అమర్చారు. అడ్రెనో 619ఎల్ జీపీయూ గ్రాఫిక్స్, 8జిబి ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Moto Edge 30 Neo మూడు రియర్ కెమెరాలతో వస్తోంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా ఓఐఎస్ సపోర్ట్ తో వస్తుండటం విశేషం. అలాగే 13ఎంపి అల్ట్రా వైడ్ సెకండరీ లెన్స్ కూడా ఉంది. ఈ వైడ్ యాంగిల్ కెమెరాలో మ్యాక్రో మోడ్ కూడా ఉంది. మూడో కెమెరాగా 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించారు. Moto Edge 30 Neo లో 4020 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ టర్బో చార్జింగ్, 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ ఉన్నాయి.

Moto Edge 30 Neo లో యూఎస్బీ టైప్-సీ ఆడియో, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి. 5జీ ఎస్ఏ/ఎన్ఎస్ఏ, డ్యూయల్ 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. Moto Edge 30 Neo 152.9 మిల్లీ మీటర్ల పొడవు, 71.2 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.75 మిల్లీ మీటర్ల మందం, 155 గ్రాముల బరువు ఉంటుంది.

ఓఐఎస్ కెమెరా కోసం చూసే వారికి Moto Edge 30 Neo మంచి ఆప్షన్ అని చెప్పాలి. దాంతో పాటు 13 ఎంపి వైడ్ యాంగిల్ కెమెరా మ్యాక్రో షూటర్ గా కూడా పని చేస్తుంది. అలాగే ఇందులో ఐపీ52 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ ఉండటం మరొక ప్లస్ పాయింట్. తక్కువ మందం, బరువు కలిగి స్లిమ్ ప్రొఫైల్ తో వస్తున్న ఈ ఫోన్ ఆకట్టుకునే విధంగా ఉంది. 5జీ కనెక్టివిటీ ఎలాగూ ఉంది. కాబట్టి ఈ ఫోన్ కస్టమర్లను ఆకర్షించడం ఖాయమని చెప్పవచ్చు.

లేటెస్ట్ టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.