భారత్ లో లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra

హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Moto Edge 30 Ultra
  • ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra
  • భారత్ లో Moto Edge 30 Ultra ధర రూ.59,999

Moto Edge 30 Ultra: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా భారత్ లో రెండు కొత్త 5జీ ఫోన్లను లాంచ్ చేసింది. Moto Edge 30 Ultra, Moto Edge 30 Fusion ఫోన్లను మోటోరోలా భారతీయులకు పరిచయం చేసింది. Moto Edge 30 Ultra గురించి మాట్లాడితే, ఇది ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్. ఇందులో శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ను వాడారు. అలాగే స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ ని ఈ ఫోన్లో అమర్చారు.

Moto Edge 30 Ultra ధర, అమ్మకం

Moto Edge 30 Ultra 8జిబి + 128జిబి వర్షన్ ధరను మోటోరోలా కంపెనీ రూ.59,999 గా నిర్ణయించింది. ఇక లాంచ్ ఆఫర్ క్రింద, ఈ ఫోన్ ప్రస్తుతానికి రూ.54,999 కి అమ్మబడుతుంది. ఈ డివైస్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్. ఆఫర్ ధర ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కనుక, ఫోన్ నచ్చితే కనుక సేల్ తేదీ రోజున ఆర్డర్ చేసుకుంటే బెటర్.

సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు Moto Edge 30 Ultra సేల్ కి వస్తోంది. ఫోన్ ని ఫ్లిప్ కార్ట్, రిలయన్స్ డిజిటల్ ఔట్‌లెట్స్, రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, రూ.14,699 విలువ గల జియో బెనిఫిట్స్ లభిస్తాయి. ఇవి రూ.100 విలువ గల 40 రీచార్జ్ వోచర్స్, రూ.10,699 పార్ట్నర్ వోచర్స్ కలుపుకుని వస్తాయి. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా ఫోన్ సేల్ కి వస్తుండటంతో కస్టమర్లు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంది.

Moto Edge 30 Ultra కెమెరా

Moto Edge 30 Ultra యొక్క కెమెరా గురించి మాట్లాడితే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో F/1.95 అపర్చర్ తో కూడిన 200MP Samsung ISOCELL HP1 సెన్సర్, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 12MP టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60MP OmniVision OV60A ఫ్రంట్ కెమెరా ఉంది. 60ఎంపి కెమెరా వ్లాగింగ్ చేసే వారికి ఎంతో ఉపయోగపడనుంది.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5, 1250 నిట్స్ బ్రైట్నెస్, 1500హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 4610 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ టర్బో పవర్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ చార్జింగ్ Moto Edge 30 Ultra లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleభారత్ లో లాంచైన Realme Narzo 50i Prime
Next article50MP మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ చార్జింగ్ తో రానున్న Redmi Note 12
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.