
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో మోటో ఎడ్జ్ 50 ప్రో డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఏప్రిల్ 3వ తేదీన భారత్ లో Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతోంది. తాజాగా ఒక టీజర్ ఇమేజ్ ద్వారా Moto Edge 50 Pro యొక్క డిజైన్‌ని మోటోరోలా రివీల్ చేసింది. చైనాలో ఈ ఫోన్ Moto X50 Ultra పేరుతో లాంచ్ అవుతోంది. యూఎస్ లో Motorola Edge+ (2024) పేరుతో ఎంట్రీ ఇవ్వబోతోంది. సరే, ఓసారి Moto Edge 50 Pro ఇండియా లాంచ్ వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto Edge 50 Pro ఇండియా లాంచ్ ఖరారు
Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో ఏప్రిల్ 3న లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఆన్‌లైన్ స్టోర్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా సేల్ కి వస్తోంది.
టీజర్ ప్రకటన ద్వారా ప్రధానంగా ఏఐ ఫీచర్లు హైలైట్ అవుతున్నాయి. దీన్ని బట్టి, Moto Edge 50 Pro లో ఆకట్టుకునే ఏఐ ఫీచర్లు ఉంటాయని అర్థమవుతోంది.
Moto Edge 50 Pro లో 50ఎంపి ఏఐ ప్రో-గ్రేడ్ కెమెరా ఉంటుంది. ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఫోటో ఎన్హాన్స్‌మెంట్ ఇంజిన్, టిల్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
Moto Edge 50 Pro ఫీచర్లు (ఖరారైనవి)
- డిస్ప్లే: Moto Edge 50 Pro లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ 1.5కే స్క్రీన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉంటాయి. పాంటోన్ వ్యాలిడేటెడ్ డిస్ప్లే తో వస్తోన్న మొదటి ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది.
- కెమెరా: Moto Edge 50 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, ఇతర సెన్సర్స్ ఉంటాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది.
Moto Edge 50 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)
Moto Edge 50 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 12జిబి ర్యామ్, 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 125 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయి.
Moto Edge 50 Pro లో 50ఎంపి ప్రైమరీ వైడ్ యాంగిల్ కెమెరా, 6X టెలీఫోటో జూమ్ కెమెరా ఉంటాయి.
Moto Edge 50 Pro డిజైన్, కలర్ ఆప్షన్స్
Moto Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ కర్వ్డ్ ఎడ్జెస్, ఫ్లాట్ డిస్ప్లే, పంచ్-హోల్ కెమెరాతో వస్తోంది.
Moto Edge 50 Pro ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్ లో రానుంది. తెలుపు రంగు వీగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.











