స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 165 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే తో లాంచైన Moto Edge+ (2023)

Highlights

  • కర్వ్డ్ డిస్ప్లేతో లాంచైన Moto Edge+ (2023)
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా, 12ఎంపి టెలీఫోటో లెన్స్ తో వచ్చిన ఫోన్
  • ఐపీ68 రేటింగ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఈ ఫోన్ ప్రత్యేకతలు

మోటో జీ 5జీ (2023) మరియు మోటో జీ స్టైలస్ (2023) ఫోన్లతో పాటు మోటోరోలా కంపెనీ ఫ్లాగ్షిప్ డివైజ్ Moto Edge+ (2023) ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వచ్చింది.

Moto Edge+ (2023) లో 50ఎంపి ప్రైమరీ రియర్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 60ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఇంకా వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్లు కూడా ఈ డివైజ్ లో ఉన్నాయి.

సరే, ఓసారి Moto Edge+ (2023) స్మార్ట్ ఫోన్ ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ మరియు లభ్యత తదితర సమాచారం తెలుసుకుందాం పదండి.

Moto Edge+ (2023) ధర మరియు లభ్యత

Moto Edge+ (2023) స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధర యూఎస్ లో 799 డాలర్లు (సుమారు రూ.65,400) గా ఉంది. కెనెడాలో ఈ ఫోన్ ధర 1299.99 డాలర్లు (సుమారు రూ.78,000) గా ఉంది.

యూఎస్ మరియు కెనెడా దేశాల్లో Moto Edge+ (2023) స్మార్ట్ ఫోన్ ప్రీ-ఆర్డర్స్ మే 19 నుంచి మొదలుకానున్నాయి. మే 25 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. భారత్ తో సహా ఇతర మార్కెట్స్ లో ఫోన్ లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

Moto Edge+ (2023) స్పెసిఫికేషన్స్

డిస్ప్లే

Moto Edge+ (2023) లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 10-బిట్ ప్యానెల్, డాల్బి విజన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉన్నాయి.

ప్రాసెసర్, స్టోరేజీ, ఓఎస్

Moto Edge+ (2023) లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది అడ్రెనో జీపీయూ గ్రాఫిక్స్ తో పెయిర్ అయ్యింది. 8జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ హ్యాండ్సెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా విభాగం

Moto Edge+ (2023) లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 60ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ, చార్జింగ్

Moto Edge+ (2023) లో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 15 వాట్ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ, కలర్ ఆప్షన్స్

Moto Edge+ (2023) డివైజ్ ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 161.16 మిల్లీ మీటర్ల పొడవు, 74 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.59 మిల్లీ మీటర్ల మందం, 203 గ్రాముల బరువు ఉంటుంది. డాల్బి అట్మాస్ తో కూడిన స్టీరియో స్పీకర్ సెటప్ ఈ ఫోన్ లో ఉంది. ఈ హ్యాండ్సెట్ లో డ్యూయల్ సిమ్ (ఇ-సిమ్ + నానో), 5జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి.