Home News Moto G Stylus (2025): లాంచ్‌కి ముందు రివీలైన మోటో జీ స్టైలస్ (2025) రెండర్ ఇమేజ్

Moto G Stylus (2025): లాంచ్‌కి ముందు రివీలైన మోటో జీ స్టైలస్ (2025) రెండర్ ఇమేజ్

Highlights
  • త్వరలో Moto G Stylus (2025) లాంచ్
  • తాజాగా రివీలైన డివైజ్ యొక్క డిజైన్
  • మోడల్ నంబర్ Kanas XT251V

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola త్వరలో జీ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G Stylus (2025) పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుంది. ఈ ఏడాది మే నెలలో Moto G Stylus (2024) ని మోటోరోలా లాంచ్ చేసింది. అయితే ఇది గ్లోబల్ మార్కెట్స్ లో లాంచ్ అయ్యింది. కానీ, భారత్ కి రాలేదు. ఇప్పుడు Moto G Stylus (2025) కూడా గ్లోబల్ మార్కెట్స్ కి పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓసారి రివీలైన డిజైన్ మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Moto G Stylus (2025) డిజైన్ (లీక్)

My Smart Price తాజాగా Moto G Stylus (2025) యొక్క ఎక్స్‌క్లూజివ్ రెండర్ ఇమేజ్ ను తన కథనం ద్వారా పంచుకుంది.

Moto G Stylus (2025) డివైజ్ Kanas XT251V అనే మోడల్ నంబర్ తో నెట్టింట్లో ప్రత్యక్షమైంది.

డివైజ్ మోడల్ నంబర్ లోని 25 అనే నంబర్ వచ్చే ఏడాదిని సూచిస్తోందని అనుకోవచ్చు. ఇక డిజైన్ విషయానికి వస్తే, Moto G Stylus (2025) వీగన్ లెదర్ ఫినిష్డ్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది.

ఫోన్ కి ముందువైపున పంచ్-హోల్ కటౌట్, సన్నని బెజెల్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ మరియు పవర్ బటన్స్ ఉన్నాయి.

గత మోడల్ మాదిరి, ఈ ఫోన్ లో కూడా బాటమ్ లో స్టైలస్ హోల్డర్ ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది స్క్వేర్ షేప్ లో ఫోన్ కి టాప్ లెఫ్ట్ కార్నర్ లో ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ పై సెంటర్ లో మోటో లోగో ఉంటుంది.

రెండర్ ను గమనిస్తే, Moto G Stylus (2025) డివైజ్ బ్లూ కలర్ లో కనిపిస్తోంది. ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Moto G Stylus (2024) స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Moto G Stylus (2024) లో 6.7-ఇంచ్ పీఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్: Moto G Stylus (2024) లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వినియోగించారు.

కెమెరా: Moto G Stylus (2024) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 13ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

బ్యాటరీ, చార్జింగ్: Moto G Stylus (2024) లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.