ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G04 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. ఎంట్రీ లెవెల్ ఫోన్ కొనాలని భావించే వారికి Moto G04 సరైన ఎంపిక అవ్వొచ్చు. Moto G04 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఈ ఫోన్ ధర, లభ్యత మరియు స్పెసిఫికేషన్స్ తదితర వివరాలను తెలుసుకుందాం పదండి.
Moto G04 ధర, లభ్యత
- Moto G04 డివైజ్ భారతీయ మార్కెట్ లో రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
- Moto G04 డివైజ్ యొక్క 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.6,999 గా నిర్ణయించారు.
- Moto G04 డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.7,999 గా ఉంది.
- Moto G04 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ ఆఫర్ లో భాగంగా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
- Moto G04 4జిబి+64జిబి వేరియంట్ పై రూ.750 ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో ఫోన్‌ని రూ.6,249 కే సొంతం చేసుకోవచ్చు.
- Moto G04 డివైజ్ బ్లూ, ఆరెంజ్, బ్లాక్ మరియు గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
- Moto G04 స్మార్ట్‌ఫోన్‌ని ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫిబ్రవరి 22 నుంచి కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా అధికార వెబ్సైట్ మరియు ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.
Moto G04 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G04 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G04 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్సెట్ వాడారు.
- ర్యామ్, స్టోరేజీ: Moto G04 డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ ఫీచర్ సాయంతో గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ యూజర్ కి లభిస్తుంది.
- కెమెరా: Moto G04 లో 16ఎంపి మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ: Moto G04 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- ఓఎస్: Moto G04 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto G04 స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ సిమ్, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు: Moto G04 స్మార్ట్‌ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, డాల్బీ అట్మాస్, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
