Home News Motorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power

Motorola: జనవరి 30న భారత్‌లో లాంచ్ కానున్న Moto G24 Power

Highlights
  • 50ఎంపి కెమెరాతో వస్తోన్న Moto G24 Power
  • 8జిబి ర్యామ్‌ని ఆఫర్ చేయనున్న డివైజ్
  • లాంచ్ తేదీని అధికారికంగా టీజ్ చేసిన కంపెనీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G24 Power ని లాంచ్ చేయనుంది. తాజాగా తన X హ్యాండిల్ పై Moto G24 Power లాంచ్ ప్రకటన చేసింది. పోస్ట్ ప్రకారం, Moto G24 Power డివైజ్ భారత్ లో జనవరి 30 న లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ప్రముఖ రిటైల్ స్టోర్స్ ద్వారా Moto G24 Power డివైజ్ సేల్ కి రానుంది.

ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ పై Moto G24 Power డివైజ్ యొక్క మైక్రోసైట్ దర్శనమిస్తుండటంతో స్పెసిఫికేషన్స్ ఏంటో తెలిసిపోయాయి. అంతేకాదు, Moto G24 Power ఫోన్ కంపెనీ అధికార వెబ్‌సైట్ లో కూడా లిస్ట్ అయ్యింది.

Moto G24 Power స్పెసిఫికేషన్స్