Geekbench పై లిస్టైన Moto G24; త్వరలో లాంచ్ అయ్యే అవకాశం!

Highlights

  • 8జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై కనిపించిన Moto G24
  • లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తోన్న ఫోన్
  • ఇంకా వెల్లడికాని లాంచ్ ప్రకటన

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. Moto G24 పేరుతో వస్తోన్న ఈ ఫోన్ తాజాగా బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో Moto G24 యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. సరే, ఓసారి Moto G24 డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G24 గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Moto G24 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 407 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1399 పాయింట్లు సాధించింది.
  • లిస్టింగ్ ప్రకారం, Moto G24 లో ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంటుందని తెలుస్తోంది.
  • Moto G24 గీక్ బెంచ్ లిస్టింగ్ లో మాలి జీ52 జీపీయూ పేర్కొనబడి ఉంది.
  • మొత్తం మీద చూస్తే, Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుందని అర్థమవుతోంది.
  • ఇంకా లిస్టింగ్ ద్వారా 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ రివీల్ అయ్యాయి.

Moto G24 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Moto G24 లో ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండవచ్చు.
  • ప్రాసెసర్: Moto G24 లో మీడియాటెక్ హీలియో జీ85 చిప్ ఉంటుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.
  • మెమొరీ: Moto G24 లో 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
  • కెమెరా: Moto G24 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెన్సర్స్ వివరాలు ఇంకా తెలియలేదు.
  • బ్యాటరీ: Moto G24 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
  • ఓఎస్: Moto G24 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G24 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.
Previous articleఅన్‌బాక్సింగ్ వీడియో ద్వారా రివీలైన Redmi 13C డిజైన్, స్పెసిఫికేషన్స్
Next articleLord Of 5G: 90Hz డిస్ప్లేతో వస్తోన్న Lava Blaze 2 5G
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.