హైలైట్స్:
- యూరోప్ లో మోటో జీ32 ఫోన్ ని లాంచ్ చేసిన మోటోరోలా
- 90 హెర్ట్జ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- త్వరలోనే భారత్ తో పాటు లాటిన్ అమెరికా దేశాల్లో లాంచ్ కానున్న మోటో జీ32
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా యూరప్ లో మోటో జీ32 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మోటో జీ42 తో పోల్చితే ఈ ఫోన్ కాస్త అప్‌గ్రేడెడ్ వర్షన్ అనిపిస్తోంది. జులై మొదటివారంలో మోటో జీ42 ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యింది. అయితే భారత్ కి వచ్చేసరికి ఫోన్ యొక్క ఫీచర్లు మారిపోయే అవకాశముంది. ఈ ఫోన్ ఎంట్రీ లెవెల్ యూనిసాక్ చిప్సెట్ తో వచ్చే అవకాశముంది. ఇక యురోపియన్ వర్షన్ మోటో జీ32 విశేషాలు చూద్దాం. స్నాప్ డ్రాగన్ 680 చిప్సెట్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 90 హెర్ట్జ్ డిస్ప్లే, 50ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ఇక గమనించగ్గ విషయం ఏంటంటే, ఈ ఫోన్ అమోలెడ్ డిస్ప్లేకి బదులు, ఎల్సీడీ డిస్ప్లేతో వస్తోంది.
Moto G32 ధర
యూరోప్ లో మోటో జీ32 4జిబి ర్యామ్, 128జిబి వేరియంట్ ధర 230 యూరోలుగా ఉంది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.19,000. సేటిన్ సిల్వర్, మినరల్ గ్రే అనే రెండు రంగుల్లో ఈ ఫోన్ లభ్యం కానుంది.
Moto G32 స్పెసిఫికేషన్స్
ఇప్పుడు స్పెసిఫికేషన్స్ వివరాలను చూద్దాం. మోటో జీ32 స్మార్ట్ ఫోన్ లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 405 పిక్సెల్స్ పర్ ఇంచ్ (పీపీఐ), డీసీఐ-పీ3 కలర్ గేముత్ సపోర్ట్, 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా-కోర్ ప్రాసెసర్, అడ్రోనో 610 జీపీయూ, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి ఇంటర్నల్ స్టోరేజీ, మెమొరీ కార్డు ద్వారా 1టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజీ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ వెనకాల మూడు కెమెరాలను అమర్చారు. వీటిలో ఒకటి 50ఎంపి ప్రైమరీ కెమెరా, రెండోది 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, మూడోది 2ఎంపి మ్యాక్రో కెమెరా. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఇక బ్యాటరీ విభాగానికి వస్తే, ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
మోటో జీ32 స్మార్ట్ ఫోన్లో 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, డ్యూయల్ సిమ్, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జ్యాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. ఇక ఆడియో కోసం, జీ32 లో డాల్బీ అట్మాస్ తో కూడిన రెండు స్పీకర్లను అమర్చారు. భద్రత కొరకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఈ డివైజ్ 184 గ్రాములు బరువుంటుందని అంచనా. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, మోటో జీ32 ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది.