ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో Moto G34 5G డివైజ్ ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. అయితే దీనికి సంబంధించిన లాంచ్ వివరాలు అధికారికంగా వెలువడలేదు. కానీ, ఈలోపు Moto G34 5G లాంచ్ తేదీ లీక్ అయ్యింది. జనవరి 9వ తేదీన భారతీయ మార్కెట్ లోకి Moto G34 5G ఎంట్రీ ఇవ్వనుందంటూ ఓ టిప్‌స్టర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.
Moto G34 5G భారత్ లాంచ్ తేదీ (లీక్)
- Moto G34 5G యొక్క టీజర్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై లిస్ట్ అయ్యింది.
- ఈ టీజర్ లో Moto G34 5G డివైజ్ ప్రీమియమ్ వీగన్ లెదర్ ఫినిష్ తో పాటు ఇతర కలర్ డిజైన్స్ లో కనిపిస్తోంది.
- జనవరి 9 వ తేదీన Moto G34 5G భారత్ లో లాంచ్ అవుతోందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ తన X ఖాతా ద్వారా తెలిపారు.
[Exclusive] I can confirm that the moto G34 5G will be announced in India on 9th Jan. The device will be the fastest 5G in its segment (Snapdragon 695) and will feature a premium vegan leather design.
Will share more details soon.
Feel free to repost.#motoG345G pic.twitter.com/AlPq1hu3f0— Mukul Sharma (@stufflistings) January 2, 2024
Moto G34 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
- ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుంది.
- ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G డివైజ్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ తో రానుంది.
- కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
- బ్యాటరీ: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- సాఫ్ట్వేర్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, గ్లొనాస్, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ వంటి ఆప్షన్స్ ఉంటాయి.
- ఇతర ఫీచర్లు: Moto G34 5G లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, సాఫ్ట్వేర్ బేస్డ్ ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎల్డీఏసీ, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి.
Moto G34 5G ధర (అంచనా)
Moto G34 5G డివైజ్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. అక్కడ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ ధరను 999 యువాన్లు (సుమారు రూ.11,990) గా నిర్ణయించారు. భారత్ లో కూడా ఇదే రేంజ్ లో ధర ఉండే అవకాశం ఉంది.
