120Hz రిఫ్రెష్ రేట్‌తో చైనాలో లాంచైన Moto G34 5G

Highlights

  • చైనాలో లాంచైన Moto G34 5G
  • స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌తో వచ్చిన డివైజ్
  • Moto G34 5G ప్రారంభ ధర 999 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola చైనాలో Moto G34 5G అనే ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ ని బడ్జెట్ సెగ్మెంట్ కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చారు. త్వరలోనే గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ కానుంది. Moto G34 5G డివైజ్ లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 8జిబి ర్యామ్, 8జిబి వర్చువల్ ర్యామ్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. సరే, ఓసారి Moto G34 5G డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Moto G34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు.
  • ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ ఉన్నాయి. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది. అంతేకాదు, మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
  • కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఐ 6.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ఇతర ఫీచర్లు: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నాయి.
  • బరువు, చుట్టుకొలత: Moto G34 5G డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 7.99 మి.మీ మందం, 179 గ్రాముల బరువు ఉంటుంది.

Moto G34 5G ధర

  • Moto G34 5G స్మార్ట్ ఫోన్ సింగిల్ వేరియంట్ (8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ) లో లాంచ్ అయ్యింది.
  • Moto G34 5G 8జిబి+128జిబి ధరను 999 యువాన్లు (సుమారు రూ.11,990) గా నిర్ణయించారు.
  • Moto G34 5G స్మార్ట్‌ఫోన్ స్టార్ బ్లాక్, సీ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.