ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు భారతీయ మార్కెట్ లో Moto G34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హెచ్డీ+ రెజుల్యూషన్, డ్యూయల్ కెమెరా సెటప్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చింది. ఎంట్రీ లెవెల్ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. సరే, ఓసారి Moto G34 5G యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.
Moto G34 5G ధర, లభ్యత, ఆఫర్లు
- Moto G34 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు తెలుసుకుందాం.
- Moto G34 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.10,999 గా నిర్ణయించారు.
- Moto G34 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంది.
- Moto G34 5G డివైజ్‌ని ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా ఇండియా వెబ్సైట్, రిటైల్ ఔట్లెట్స్ ద్వారా జనవరి 17 నుంచి కొనుగోలు చేయవచ్చు.
- లాంచ్ ఆఫర్ లో భాగంగా పాత ఫోన్ పై రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. దీంతో డివైజ్ ని రూ.9,999 కే సొంతం చేసుకోవచ్చు.
- ఇంకా కస్టమర్లు రూ.399 విలువగల జియో ప్రీపెయిడ్ ప్లాన్ పై రూ.50 క్యాష్‌బ్యాక్ వోచర్ (40) పొందవచ్చు. అలాగే అజియో పై రూ.500 డిస్కౌంట్, యాత్ర ద్వారా ఫ్లయిట్ బుకింగ్స్ పై రూ.1,500 డిస్కౌంట్ పొందవచ్చు.
Moto G34 5G స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto G34 5G లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 19:9 యాస్పెక్ట్ రేషియో, 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G34 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి.
- ర్యామ్, స్టోరేజీ: Moto G34 5G డివైజ్ 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని పెంచుకోవచ్చు.
- సాఫ్ట్వేర్: Moto G34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
- కెమెరా: Moto G34 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
- బ్యాటరీ, చార్జింగ్: Moto G34 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- కనెక్టివిటీ: Moto G34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, బైడూ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో ఉన్నాయి.
- బరువు, చుట్టుకొలత: Moto G34 5G 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 180 గ్రాముల బరువు ఉంటుంది.
