Home News Moto G35 5G: 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో లాంచైన మోటో జీ35 5జీ

Moto G35 5G: 16ఎంపి ఫ్రంట్ కెమెరాతో లాంచైన మోటో జీ35 5జీ

Highlights
  • నేడు Moto G35 విడుదల
  • 6.7-ఇంచ్ FHD+ డిస్ప్లే
  • 50ఎంపి రియర్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్‌గా జీ-సిరీస్ లో కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఇవి Moto G35, Moto G55 అనే పేర్లతో మార్కెట్ లోకి వచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G35 గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ లో యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్, 4జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Moto G35 ధర

Moto G35 స్మార్ట్‌ఫోన్ ధరను గ్లోబల్ మార్కెట్ లో 199 యూరోలు (సుమారు రూ.18,500) గా పెట్టారు. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. దీని ధర రూ.15,000 లోపు ఉంటుందని సమాచారం.

యూరప్ లో Moto G35 డివైజ్ గుఆవా రెడ్, మిడ్నైట్ బ్లాక్ మరియు లీఫ్ గ్రీన్ వీగన్ లెదర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G35 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G35 5G లో 6.72-ఇంచ్ ఫుల్‌హెచ్డీ స్క్రీన్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G35 5G లో యూనిఎస్ఓసీ టీ760 చిప్సెట్ వాడారు. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Moto G35 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.

కెమెరా: Moto G35 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G35 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Moto G35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.