
రూ.10,999 ప్రారంభ ధరతో Motorola కంపెనీ Moto G45 అనే స్మార్ట్‌ఫోన్ ని ఇటీవలె లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో డీసెంట్ ఫోన్ కొనాలని భావించే వారి కోసం మంచి స్పెసిఫికేషన్స్ తో ఈ ఫోన్ వచ్చింది. మరోవైపు, ఇదే సెగ్మెంట్ లో iQOO సంస్థ iQOO Z9 Lite అనే డివైజ్‌ను లాంచ్ చేసింది. మోటో జీ45 కి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పవచ్చు. జెడ్9 లైట్ ధర రూ.10,499 గా ఉంది.
ఈ ఆర్టికల్ లో మనం Moto G45 మరియు iQOO Z9 Lite స్మార్ట్‌ఫోన్లను పోల్చి చూసి ఏది ఎక్కువ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అనే విషయాన్ని తెలుసుకుందాం.
Moto G45 vs iQOO Z9 Lite: స్పెసిఫికేషన్స్
Moto G45
డిస్ప్లే: మోటో జీ45 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 405పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 720*1600 రెజుల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉన్నాయి.
బరువు, చుట్టుకొలత: మోటో జీ45 డివైజ్ 162.7 మి.మీ పొడవు, 74.6 మి.మీ వెడల్పు, 8 మి.మీ మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.
సాఫ్ట్‌వేర్: మోటో జీ45 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
కెమెరా: మోటో జీ45 లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
వీడియో: 1080పి/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3
బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
స్టోరేజీ: 4జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
కలర్స్: బ్రిలియంట్ బ్లూ, వివా మజెంటా, బ్రిలియంట్ గ్రీన్
iQOO Z9 Lite
డిస్ప్లే: 6.56-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 269పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 720*1612 రెజుల్యూషన్
బరువు, చుట్టుకొలత: 163.6 మి.మీ పొడవు, 75.6 మి.మీ వెడల్పు, 8.4 మి.మీ మందం, 185 గ్రాముల బరువు
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ 14 కస్టమ్ స్కిన్
రియర్ కెమెరా: 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ కెమెరా
సెల్ఫీ కెమెరా: 8ఎంపి ఫ్రంట్ కెమెరా
వీడియో: 1080పి/30ఎఫ్‌పీఎస్
చిప్సెట్: మీడియాటెక్ డైమెన్సిటీ 6300
బ్యాటరీ, చార్జింగ్: 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
స్టోరేజీ: 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
కలర్స్: మోకా బ్రౌన్, ఆక్వా ఫ్లో
Moto G45 vs iQOO Z9 Lite: ధర
Moto G45
4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 గా ఉంది.
iQOO Z9 Lite
4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499 గా ఉంది.
6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,499 గా ఉంది.
Moto G45 vs iQOO Z9 Lite: డిజైన్
Moto G45 వీగన్ లెదర్ బాడీ, మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. బ్లూ, గ్రీన్ మరియు రెడ్ కలర్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఐపీ52 రేటింగ్ అందించారు.
iQOO Z9 Lite ప్లాస్టిక్ బాడీ, మ్యాట్ ఫినిష్ తో వచ్చింది. ఆక్వా ఫ్లో ఎడిషన్ గ్రేడియంట్ బ్యాక్, బ్రష్ స్ట్రోక్-లైక్ ప్యాటర్న్ కలిగి ఉంది. మోకా బ్రౌన్ వేరియంట్, ప్లెయిన్ బ్రౌన్ ఫినిష్ తో సింపుల్, ఎలిగెంట్ లుక్ కలిగి ఉంది. ఇది ఐపీ64 రేటింగ్ కలిగి ఉంది.
Moto G45 vs iQOO Z9 Lite: డిస్ప్లే
డిస్ప్లే విషయంలో Moto G45, iQOO Z9 Lite కంటే కాస్త మెరుగ్గా ఉంది. రెండు ఫోన్లు కూడా హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ కలిగి ఉన్నాయి. అయితే మోటో జీ45 లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉండగా, ఐకూ జెడ్9 లైట్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. రిఫ్రెష్ రేట్ అనేది వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్, స్క్రోలింగ్ మరియు గేమింగ్ వంటి సందర్భాల్లో ప్రభావం చూపుతుంది.
మోటో జీ45 మరో విషయంలో ఐకూ జెడ్9 లైట్ కంటే బెటర్ గా ఉంది. అదే గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్. ఈ అదనపు భద్రత లేయర్ వల్లన ఫోన్ డిస్ప్లేకి స్క్రాచెస్ పడకుండా రక్షణ లభిస్తుంది.
Moto G45 vs iQOO Z9 Lite: పెర్ఫామెన్స్
Moto G45 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంది. ఇది iQOO Z9 Lite లో ఇచ్చిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ కంటే ఎంతో శక్తివంతమైనది. అంతేకాదు, Moto G45 లో 8జిబి వరకు ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ, iQOO Z9 Lite లో 6జిబి ర్యామ్ మాత్రమే ఉంది. దీన్ని బట్టి, Moto G45 మల్టీటాస్కింగ్ విషయంలో విన్నర్ అని చెప్పవచ్చు.
మేం జరిపిన టెస్టింగ్ లో, Moto G45 అంటుటు స్కోర్ 4,49,055 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 929 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2,159 పాయింట్లు స్కోర్ చేసింది. మరోవైపు, iQOO Z9 Lite అంటుటు స్కోర్ 4,01,756 పాయింట్లుగా ఉంది. గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 734 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1,968 పాయింట్లు స్కోర్ చేసింది.
Moto G45 vs iQOO Z9 Lite: కెమెరాలు
రెండు ఫోన్లలో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. ఇది స్పష్టమైన, వివరమైన ఫోటోలను క్యాప్చర్ చేస్తోంది. అలాగే రెండు ఫోన్లలో 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంది. మోటో జీ45 లో మ్యాక్రో కెమెరా ఉంది. ఐకూ జెడ్9 లైట్ లో డెప్త్ సెన్సర్ ఉంది.
Moto G45 లో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఇవ్వగా, iQOO Z9 Lite లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. మోటో జీ45 లో ఉన్న 16ఎంపి కెమెరా ఐకూ జెడ్9 లైట్ కంటే మెరుగైన ఫోటోలను తీస్తుంది.
Moto G45 vs iQOO Z9 Lite: బ్యాటరీ, చార్జింగ్
రెండు ఫోన్లు కూడా 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ అయ్యాయి. పీసీమార్క్ బ్యాటరీ టెస్టులో ఐకూ జెడ్9 లైట్ 16 గంటల 36 నిమిషాలు స్కోర్ చేసింది. మరోవైపు, మోటో జీ45 కేవలం 9 గంటల 51 నిమిషాలు స్కోర్ చేసింది. ఈ విషయంలో ఐకూ జెడ్9 లైట్ విన్నర్ అని చెప్పవచ్చు.
రెండు ఫోన్లలో 30 నిమిషాల పాటు యూట్యూబ్ వీడియోలు చూడగా, రెండింట్లోనూ 4 శాతం బ్యాటరీ ఖర్చయ్యింది.
ఐకూ జెడ్9 లైట్ 15 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అవ్వడానికి 1 గంటా 46 నిమిషాల సమయం పట్టింది. మోటో జీ45 ఫోన్ 18 వాట్ చార్జర్ తో 20 శాతం నుంచి 100 శాతం చార్జ్ అయ్యేందుకు 1 గంటా 34 నిమిషాల సమయం పట్టింది.
Moto G45 vs iQOO Z9 Lite: సాఫ్ట్‌వేర్
Moto G45 ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. iQOO Z9 Lite ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ తో లాంచ్ అయ్యింది. అయితే ఐకూ జెడ్9 లైట్ కి రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. మరోవైపు, మోటో జీ45 కి కేవలం ఒక ఆండ్రాయిడ్ అప్డేట్ (ఆండ్రాయిడ్ 15) మాత్రమే వస్తుంది. అలాగే 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి.
ఐకూ జెడ్9 లైట్ 50 కి పైగా థర్డ్-పార్టీ యాప్స్ తో వస్తుంది. వీటిని మీకు వద్దనుకుంటే తీసివేయవచ్చు. మరోవైపు, Moto G45 లో ఎటువంటి ప్రీ-ఇన్‌స్టాల్డ్ యాప్స్ ఉండవు. కేవలం కొన్ని గూగుల్ యాప్స్ మాత్రమే ఉంటాయి. దీంతో బ్లోట్‌వేర్-ఫ్రీ అనుభూతిని ఈ ఫోన్ అందిస్తుంది.
ఏది బెటర్?
రెండు ఫోన్లను అన్ని విభాగాల్లో వాటి యొక్క పెర్ఫామెన్స్‌ను పరిశీలించాక, Moto G45 బెటర్ ఆప్షన్ అని స్పష్టమవుతోంది. ఈ ఫోన్ ఐకూ జెడ్9 లైట్ కంటే బెటర్ డిస్ప్లే, సూపీరియర్ చిప్సెట్, అత్యధిక ర్యామ్, మెరుగైన సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉంది.
అయితే దీన్ని బట్టి, iQOO Z9 Lite తక్కువనుకోవద్దు. ధర ప్రకారం, ఇది ఫర్వాలేదనిపించే పెర్ఫామెన్స్ అందిస్తుంది. అలాగే పీమార్క్ బ్యాటరీ టెస్ట్ లో మంచి స్కోర్ సాధించింది. అలాగే మోటో జీ45 కంటే, ఒక మేజర్ అప్డేట్ జెడ్9 లైట్ కి అదనంగా లభిస్తుంది.