Discount: తక్కువ ధరకి లభిస్తోన్న Moto G51 5G స్మార్ట్‌ఫోన్

హైలైట్స్

  • 12 5G బ్యాండ్స్ తో లాంచైన Moto G51 5G స్మార్ట్ ఫోన్
  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ 5జీ ప్రాసెసర్, 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
  • ఫ్లిప్‌కార్ట్ లో డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తోన్న Moto G51 5G

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola మార్కెట్ పై పట్టు సాధిస్తోంది. అన్ని బడ్జెట్ సెగ్మెంట్స్ లో కూడా మోటోరోలా ఏదో ఒక మోడల్ తో జనాలను ఆకర్షిస్తోంది. వాల్యూ ఫర్ మనీ ఫోన్లను అందిస్తుందని మోటోరోలాకి పేరుంది. తాజాగా ఓ ఫోన్ పై ఈ సంస్థ డిస్కౌంట్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G51 5G స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 6.8-ఇంచ్ భారీ డిస్ప్లే, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీతో లాంచైంది. ప్రస్తుతం ఈ ఫోన్ పై డిస్కౌంట్ ఆఫర్ నడుస్తోంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని తగ్గింపు ధరలో పొందవచ్చు. మోటోరోలా కంపెనీ ఈ ఫోన్ పై రూ.3000 డిస్కౌంట్ ప్రకటించింది. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.

Moto G51 5G పై భారీ డిస్కౌంట్

Moto G51 5G 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ వేరియంట్ తో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.17,999 గా ఉంది. మోటోరోలా ఈ ఫోన్ పై రూ.3000 డిస్కౌంట్ ప్రకటించడంతో, ధర రూ.14,999 కి చేరింది. అయితే దీంతో పాటు ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ పై ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ని రూ.13,499 కే సొంతం చేసుకోవచ్చు.

అంతేకాదు Moto G51 5G ని ఈఎంఐ ద్వారా కనీస మొత్తం రూ.2500 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. ప్రతి నెలా రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది.

Moto G51 5G స్పెసిఫికేషన్స్

Moto G51 5G స్మార్ట్ ఫోన్ 6.8-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే కలిగి ఉంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ని కలిగి ఉంది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480+ ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. 5జీ కెపాసిటీ గురించి మాట్లాడితే, ఇందులో మొత్తం 12 5జీ బ్యాండ్స్ ఉన్నాయి. Moto G51 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 20 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇప్పుడు Moto G51 5G యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto G51 5G లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ కెమెరా అందించారు. ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous article5000mAh బ్యాటరీ, MediaTek Helio P22 చిప్ తో లాంచైన Vivo Y02
Next articleSamsung Galaxy A14 5G ఇండియా లాంచ్ ఖరారు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.