
రానున్న రోజుల్లో మోటోరోలా కంపెనీ నుంచి జీ-సిరీస్ లో పలు ఫోన్లు లాంచ్ కాబోతున్నాయి. దీంతో Moto G13, Moto G23, Moto G53, Moto G73 5G ఫోన్లకు సంబంధించిన లీక్స్ నెట్టింట్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు వివిధ సర్టిఫికేషన్ ప్లాట్ఫామ్స్ పై కనిపించాయి. ఇప్పుడు Moto G53 5G యొక్క లైవ్ ఇమేజెస్ నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. టిప్‌స్టర్ పారస్ గుగ్లాని సౌజన్యంతో MySmartPrice మోటో జీ53 ఫోన్ యొక్క లైవ్ ఇమేజెస్ ని రివీల్ చేసింది. అదనంగా రిటైల్ బాక్స్ ఇమేజెస్ ని కూడా బయటకు వచ్చాయి.
రీసెంట్ గా చైనాలో లాంచైన Moto G53 5G మోడల్ మాదిరే Moto G53 5G గ్లోబల్ వేరియంట్ కూడా ఉంది. అయితే గ్లోబల్ వేరియంట్ లో ఇంటర్నల్ హార్డ్‌వేర్ లో మార్పులు ఉంటాయి. సరే, ఓసారి డిజైన్ ని చెక్ చేయండి.
Moto G53 5G డిజైన్
Moto G53 5G డివైజ్ క్యాండీ బార్ డిజైన్ తో వచ్చింది. మైస్మార్ట్‌ప్రైస్ షేర్ చేసిన ఇమేజెస్ ని బట్టి, ఫోన్ కి వెనకాల రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెన్సర్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. ఈ ఫోన్ బ్లూ కలర్ ఆప్షన్ తో పాటు ఇతర కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.
రిటైల్ బాక్స్ లో చార్జింగ్ అడాప్టర్, యూఎస్బీ టైప్-సీ కేబుల్, సిమ్ ఎజక్టర్ టూల్ ఉన్నాయి. మాన్యువల్ బుక్లెట్ ని సైతం మనం గమనించవచ్చు. ఫోన్ పై ఉన్న ప్లాస్టిక్ కవర్ పైన ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 5జీ చిప్సెట్, 120 హెర్ట్జ్ డిస్ప్లే అని రాసి ఉంది. అలాగే బాక్స్ పై XT2335-2 అనే మోడల్ నంబర్, 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అనే వివరాలు కనిపిస్తున్నాయి. మేడ్ ఇన్ చైనా అని బాక్స్ పై రాసి ఉంది.
Moto G53 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
Moto G53 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి. ఈ డివైజ్ స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ తో రానున్నట్లు సమాచారం. 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
Moto G53 కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto G53 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అందించారు.
Moto G53 స్మార్ట్ ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 3.5 ఎంఎం జాక్, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి బేసిక్ కనెక్టివిటీ ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి. Moto G53 హ్యాండ్సెట్ 162.7 మిల్లీ మీటర్ల పొడవు, 74.6 మిల్లీ మీటర్ల వెడ్లపు, 8.1 మిల్లీ మీటర్ల మందం, 183 గ్రాముల బరువు ఉంటుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











