Home News గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Moto G53 5G, Moto G73 ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

గ్లోబల్ లాంచ్‌కి ముందు లీకైన Moto G53 5G, Moto G73 ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

Highlights
  • బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ గా వస్తోన్న Moto G53
  • 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోన్న Moto G73 5G
  • ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేయనున్న Moto G53, Moto G73

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా జీ-సిరీస్ లో స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ నుంచి రెండు కొత్త మిడ్-రేంజ్ ఫోన్లు రానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్స్: Moto G53, Moto G73. ఈ రెండు ఫోన్లకు సంబంధించిన పలు వివరాలు మరియు డిజైన్ గతంలో లీక్ అయ్యాయి. గ్లోబల్ వేరియంట్ Moto G53 5G కి, గతేడాది లాంచ్ అయిన చైనీస్ వేరియంట్ కి తేడా ఉండనుంది.

Moto G53, Moto G73 ఫోన్ల అధికార లాంచ్ తేదీని ఇంకా మోటోరోలా ప్రకటించాల్సి ఉంది. ఆ ప్రకటన కోసం వేచి చూస్తోన్న తరుణంలో.. ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్ కి సంబంధించిన ఒక కొత్త రిపోర్ట్ బయటకు వచ్చింది.

PriceBaba రిపోర్ట్ ప్రకారం, Moto G53 సింగిల్ స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది. ఈ ఫోన్ మల్టీకలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. మరోవైపు Moto G73 ఫోన్ 8జిబి ర్యామ్ తో వస్తోంది. సరే, ఓసారి Moto G53, Moto G73 ఫోన్ల ర్యామ్, స్టోరేజీ మరియు కలర్ ఆప్షన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

Moto G53 5G, Moto G73 5G ర్యామ్, స్టోరేజీ, కలర్ ఆప్షన్స్

రెండు ఫోన్లలో Moto G53 స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో లభించనుంది. లీకైన వివరాలను బట్టి, ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో వస్తోంది. బ్లూ, పేల్ పింక్, ఆర్కిటిక్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

మరోవైపు Moto G73 ఫోన్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వస్తోంది. ఈ ఫోన్ మిటియోరైట్ గ్రే, లూసెంట్ వైట్, మిడ్నైట్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభించనుంది.

Moto G53 స్పెసిఫికేషన్స్ చూస్తే, ఈ ఫోన్ లో 6.5-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, హోల్ పంచ్ కటౌట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 480+ చిప్సెట్ ఉంటాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

Moto G53 స్మార్ట్ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉంటాయి. Moto G53 స్మార్ట్ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

Moto G73 స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 930 ప్రాసెసర్ ఉంటాయి. ఇప్పటి వరకు భారత్ లో ఏ స్మార్ట్ ఫోన్ లో కూడా ఈ ప్రాసెసర్ ని వాడలేదు. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Moto G73 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్, 3.5ఎంఎం ఆడియో జాక్, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. అయితే ఈ ఫోన్ ఇండియా లాంచ్ తేదీకి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే మరింత సమాచారం తెలుస్తుందని ఆశిద్దాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.