
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో ఓ కొత్త ఫోన్ ని చైనాలో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. Moto G54 5G పేరుతో వస్తోన్న ఈ ఫోన్ గత మోడల్ Moto G53 కి సక్సెసర్ గా వస్తోంది. సెప్టెంబర్ 5 వ తేదీన Moto G54 5G డివైజ్ చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఈ హ్యాండ్సెట్ ఇప్పటికే TENAA లిస్టింగ్ పై కనిపించింది. దీంతో డిజైన్ రివీల్ అయ్యింది. గతంలో లీకైన రెండర్స్ తో దీనికి పోలికలు ఉన్నాయి.

TENAA పై కనిపించిన Moto G54 5G
- MySmartPrice తొలుత Moto G54 5G డివైజ్ ని TENAA పై గుర్తించింది. దీంతో పూర్తి డిజైన్, ప్రధాన హార్డ్‌వేర్ వివరాలు బయటకు వచ్చాయి.
- TENAA ఇమేజెస్ ద్వారా డ్యూయల్-కెమెరా సెన్సర్స్, ఒక ఎల్ఈడీ ఫ్లాష్ కనిపిస్తున్నాయి. రియర్ ప్యానెల్ పై మోటో డింపుల్ కనిపిస్తోంది.
- వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నాయి. పవర్ బటన్ లోనే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది.
- Moto G54 5G బ్లూ కలర్ ఆప్షన్ లో లభించనున్నట్లు TENAA ఇమేజెస్ ద్వారా తెలుస్తోంది.
- లిస్టింగ్ లో Moto G54 5G హ్యాండ్సెట్ 4850mAh బ్యాటరీతో రానున్నట్లు తెలిసింది.
Moto G54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
- స్క్రీన్: Moto G54 5G లో 6.5-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పంచ్-హోల్ కటౌట్ ఉంటాయి.
- కెమెరా: Moto G54 5G లో 50ఎంపి క్వాడ్-పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
- స్టోరేజీ: Moto G54 5G లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆఫర్ చేస్తున్నారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని పెంచుకునే వీలుంది.
- బ్యాటరీ: Moto G54 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఫాస్ట్ చార్జింగ్ వివరాలు ఇంకా తెలియదు.
- ఇతర ఫీచర్లు: Moto G54 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, మోటో స్పేషియల్ సౌండ్, డాల్బి అట్మాస్ ఉంటాయి.











