
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ Motorola తన భారతీయ అధికార వెబ్ సైట్ లో Moto G54 5G స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేసింది. అయితే చైనా మార్కెట్ లో ఈ ఫోన్ సెప్టెంబర్ 5 న లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. కానీ, అంతకన్నా ముందే భారత్ లో ఇంట్రడ్యూస్ చేసింది. మోటోరోలా అధికార వెబ్‌సైట్ లో Moto G54 5G డివైజ్ లిస్ట్ అవ్వడంతో ఫోన్ యొక్క పూర్తి వివరాలు యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. సరే, ఓసారి Moto G54 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, వేరియంట్స్ తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto G54 5G స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్-హోల్ కటౌట్, ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7020 చిప్ ఉంది. ఇది 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగిన ఆక్టా-కోర్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో ఐఎంజీ బీఎక్స్ఎం-8-256 జీపీయూ వినియోగించారు.
- ర్యామ్: Moto G54 5G లో రెండు మెమొరీ వేరియంట్స్ ఉన్నాయి. అవి: 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ మరియు 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
- సాఫ్ట్‌వేర్: Moto G54 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్డేట్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ఆఫర్ చేస్తోంది.
- కెమెరా: Moto G54 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Moto G54 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది టర్బోచార్జ్ టెక్నాలజీతో వచ్చింది. కేవలం కొన్ని నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
- ఇతర ఫీచర్లు: Moto G54 5G డివైజ్ 14 5జీ బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.
Moto G54 5G ధర, కలర్ ఆప్షన్స్
Moto G54 5G స్మార్ట్ ఫోన్ ధరను ఇంకా కంపెనీ వెల్లడించలేదు. ఇకపోతే ఈ ఫోన్ 8జిబి ర్యామ్, 12జిబి ర్యామ్ మోడల్స్ లో సేల్ కి రానుంది. Moto G54 5G స్మార్ట్ ఫోన్ ని మింట్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, పెర్ల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో కొనుగోలు చేయవచ్చు.











