
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నేడు గ్లోబల్ మార్కెట్స్‌లో జీ-సిరీస్ లో కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Moto G55 5G, Moto G35 5G పేర్లతో ఈ డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ ఆర్టికల్ లో మనం Moto G55 5G గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్, 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 50ఎంపి కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది. ఓసారి ఈ డివైజ్ యొక్క ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Moto G55 5G ధర, కలర్స్
Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ధరను 249 యూరోలుగా పెట్టారు. భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ.23,000. ప్రస్తుతం ఇండియా లాంచ్, సేల్ వివరాలు ఇంకా తెలియదు. Moto G55 5G స్మార్ట్‌పఓన్ ఫారెస్ట్ గ్రే, ట్విలైట్ పర్పుల్ మరియు స్మోకీ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. వీగన్ లెదర్ బ్యాక్ ఫినిష్ ఉంటుంది.
Moto G55 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Moto G55 5G లో 6.5-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, పంచ్ హోల్ కటౌట్, ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, రౌండ్ ఎడ్జ్ ఫ్లాట్ డిస్ప్లే ఉన్నాయి.
ప్రాసెసర్: Moto G55 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.5 గిగాహెర్ట్జ్.
సాఫ్ట్వేర్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హలో యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
మెమొరీ: Moto G55 5G స్మార్ట్‌ఫోన్ 3 ర్యామ్ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి 4జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ. ఏయే వేరియంట్స్ భారత్ లో లాంచ్ అవుతాయో ఇంకా తెలియదు.
కెమెరా: Moto G55 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Moto G55 5G స్మార్ట్‌ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Moto G55 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
- Moto G35 స్మార్ట్‌ఫోన్ ధరను గ్లోబల్ మార్కెట్ లో 199 యూరోలు (సుమారు రూ.18,500) గా పెట్టారు. ఈ ఫోన్ భారత్ లో కూడా లాంచ్ అవుతుంది. భారతీయ మార్కెట్ లో ఈ ఫోన్ ధర రూ.15,000 లోపు ఉంటుందని సమాచారం. Moto G35 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.











