హైలైట్స్:
- అక్టోబర్ 3 న లాంచ్ అవుతోన్న Moto G72 స్మార్ట్ ఫోన్
- ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా అనౌన్స్ అయిన Moto G72
- మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వస్తున్న Moto G72
మోటో జీ-సిరీస్ లో Moto G72 అనే స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. Moto G72 ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఫ్లిప్ కార్ట్ పేజీ ద్వారా రివీల్ అయ్యింది. అలాగే Moto G72 యొక్క కీలకమైన స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి.
అక్టోబర్ 3 న భారత్ లో Moto G72 ఫోన్ లాంచ్ అవుతుందని ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీ ద్వారా తెలుస్తోంది. Moto G72 మీడియాటెక్ హీలియో జీ99 చిప్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ తో వస్తోంది. Moto G72 యొక్క డిజైన్ కూడా రివీల్ అయ్యింది. Moto G72 రెండు కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. ఇకపోతే ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
Moto G72 10-బిట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10 సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
Moto G72 స్పెసిఫికేషన్స్
ఫ్లిప్ కార్ట్ పేజీలో కనిపించిన Moto G72 యొక్క స్పెసిఫికేషన్స్ దాదాపుగా గతంలో వచ్చిన రూమర్లతో సరిపోలుతున్నాయి. Moto G72 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుందని గతంలో ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా తెలిసింది. ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యింది. Moto G72 6.5-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే తో వస్తోంది.
ఇటీవల లీకైన Moto G72 రెండర్స్ ని గమనిస్తే, తాజాగా ఫ్లిప్ కార్ట్ పేజీలో కనిపించిన డిజైన్ లో ఒకటి వాటితో మ్యాచ్ అవుతోంది. ఫ్లిప్ కార్ట్ లో రెండు కలర్ ఆప్షన్ గురించి ఉండగా, రెండర్స్ లో మాత్రం 3 కలర్ ఆప్షన్స్ కనిపించాయి. ఇదొక్కటి మ్యాచ్ కాలేదు. మిగతా డిజైన్ మొత్తం గత వారంలో లీకైన రెండర్స్ ని పోలి ఉన్నాయి.
Moto G72 గతంలో ఎన్నో సర్టిఫికేషన్ లిస్టింగ్స్ లో కనిపించింది. XT2255-1, XT2255-2 అనే మోడల్ నంబర్స్ తో ఈ ఫోన్ లిస్టింగ్స్ లో దర్శనమిచ్చింది. XT2255-1 మోడల్ నంబర్ తో TDRA, IMEI డేటాబేస్ లపై Moto G72 కనిపించింది. ఇక XT2255-2 మోడల్ నంబర్ తో BIS వెబ్‌సైట్ లో కనిపించింది.
10-Bit డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 108ఎంపి మెయిన్ కెమెరా, అమోలెడ్ ప్యానెల్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లతో వస్తున్న Moto G72 స్మార్ట్ ఫోన్ ఒక సరైన మిడ్-రేంజ్ ఎంపిక అని చెప్పవచ్చు. దీని ధర దాదాపు రూ.15,000 ఉండవచ్చు. ఈ ధరల శ్రేణిలో మీరు కనుక ఒక ఫోన్ కోసం వెతుకుతున్నట్లైతే Moto G72 ని ప్రయత్నించండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.