Home News FCC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన Moto G72

FCC, BIS సర్టిఫికేషన్స్ పై కనిపించిన Moto G72

హైలైట్స్:

మోటో జీ సిరీస్ స్మార్ట్ ఫోన్ మోటో జీ72 పై మోటోరోలా వర్క్ చేస్తోందని సమాచారం. FCC, BIS, IMEI, TDRA సర్టిఫికేషన్స్ పై మోటో జీ72 ఉండటాన్ని తొలుత మై‌స్మార్ట్‌ప్రైస్ గమనించి వివరాలను వెలికితీసింది. రీసెంట్ గా మోటో జీ32, మోటో జీ42 మరియు మోటో జీ62 5జీ ఫోన్లను లాంచ్ చేసిన మోటోరోలా త్వరలో మోటో జీ సిరీస్ లో మరొక ఫోన్ ని లాంచ్ చేయబోతోంది. మోటీ జీ72 ఎక్స్‌టీ2255 అనే మోడల్ నంబర్ తో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ కెపాసిటీ, చార్జింగ్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి.

మోటో జీ72 FCC, TDRA, IMEI డేటాబేస్ లపై XT2255-1 అనే మోడల్ నంబర్ తో కనిపించింది. మోటీ జీ72 కి సంబంధించిన అన్ని లిస్టింగ్స్ కూడా హ్యాండ్సెట్ త్వరలోనే లాంచ్ కానుందని తెలియజేస్తున్నాయి. మరి త్వరలో లాంచ్ కానున్న ఈ మోటో జీ72 స్మార్ట్ ఫోన్ నుంచి మనం ఏం ఆశించవచ్చో ఇక్కడ చూద్దాం. పదండి.

Moto G72 సర్టిఫికేషన్స్

 

FCC లిస్టింగ్ ని బట్టి, మోటో జీ72 బ్యాటరీ ఎన్ఈ50 మోడల్ నంబర్ ని కలిగి ఉండనుంది. ఇక మోటరోలా ఎన్ఈ50 టీయూవీ సర్టిఫికేషన్ ద్వారా మోటో జీ72 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని వాడనున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ యొక్క రేటెడ్ కెపాసిటీ వచ్చి 4700 ఎంఏహెచ్ గా ఉండనుందని సమాచారం.

ఇక చార్జింగ్ అడాప్టర్ వచ్చి, ఎంసీ-331, ఎంసీ-332, ఎంసీ-333, ఎంసీ-334, ఎంసీ-336 అనే మోడల్ నంబర్స్ ని కలిగి ఉంది. DEMKO సర్టిఫికేషన్ ప్రకారం ఈ చార్జర్స్, మోటో జీ72 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉండనుందని తెలియజేస్తున్నాయి. డాక్యుమెంట్స్ ద్వారా 15W (5V/3A), 27W (9V/3A), 30W (12V/2.5A) మరియు 33W (11V/3A) పవర్ ఔట్‌పుట్ సపోర్ట్ ని తెలుపుతున్నాయి.

మోటో జీ72 FCC సర్టిఫికేషన్ ని బట్టి, ఈ ఫోన్లో బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ ఉంటాయని తెలుస్తోంది. బ్యాటరీ, చార్జింగ్, కనెక్టివిటీ వివరాలు కాకుండా మోటో జీ72 కి సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్స్ ఏంటన్నది ఇప్పటికి తెలియలేదు. రానున్న రోజుల్లో మోటో జీ72 కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

Moto G72 స్పెసిఫికేషన్స్

అంచనాలను బట్టి, మోటో జీ72 స్మార్ట్ ఫోన్లో 6.62 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ 120 హెర్ట్జ్ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ, 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరా, 16ఎంపి ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశముంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ న్యూస్ కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.