Home News Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto G85 5G యురోపియన్ రిటైల్ ధర

Motorola: లాంచ్‌కి ముందు లీకైన Moto G85 5G యురోపియన్ రిటైల్ ధర

Moto G84 5G

Highlights
  • త్వరలో Moto G85 5G లాంచ్
  • లీకైన ఐరోపా మార్కెట్ ధర
  • ప్రారంభ ధర 300 యూరోలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ, 6.55-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఓఎల్ఈడీ ప్యానెల్ వంటి స్పెసిఫికేషన్స్ తో వస్తోంది. తాజాగా మోటో జీ85 5జీ యొక్క ధర యూరోపియన్ రిటైలర్ ద్వారా లీక్ అయ్యింది. ఆ వివరాలను తెలుసుకుందాం.

Moto G85 5G ధర (లీక్)

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ యురోపియన్ రిటైలర్స్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీని ధర 300 యూరోలుగా ఉంది. అంటే భారత కరెన్సీలో దీన్ని రూ.26,900 గా చెప్పవచ్చు. ఇంతకంటే తక్కువ ధరకే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వనుంది. భారత్ లో జీ85 ప్రీడెస్ససర్ Moto G84 5G 12జిబి+256జిబి మోడల్ ధర రూ.18,999 గా ఉంది.

Moto G84 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G84 5G లో 6.55-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, 2400 * 1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, పీఓఎల్ఈడీ ప్యానెల్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G84 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2GHz. గ్రాఫిక్స్ కోసం ఈ ఫోన్ లో అడ్రెనో 619 జీపీయూ వాడారు.

ఓఎస్: Moto G84 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

కెమెరా: Moto G84 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి మ్యాక్రో + డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో f/2.45 అపర్చర్ గల 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Moto G84 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 33 వాట్ టర్బో ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Moto G84 5G లో ఐపీ54 రేటింగ్, డాల్బీ అట్మాస్ స్టీరియో స్పీకర్స్, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, 5GHz వై-ఫై, జీపీఎస్, డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉన్నాయి.