Moto G85 5G: కర్వ్డ్ డిస్ప్లేతో భారత్‌లో లాంచైన మోటో జీ85 5జీ

Highlights

  • నేడు భారత్‌లో Moto G85 5G లాంచ్
  • 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Motorola భారతీయ మార్కెట్ లో Moto G85 5G డివైజ్‌ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 32ఎంపి ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, 3డీ కర్వ్డ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G85 5G ధర, లభ్యత

Moto G85 5G డివైజ్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Moto G85 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.17,999 పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, Moto G85 5G డివైజ్ పై రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటిని వరుసగా రూ.16,999 మరియు రూ.18,999 కే సొంతం చేసుకోవచ్చు.

జులై 16వ తేదీ నుంచి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్ మరియు అర్బన్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Moto G85 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Moto G85 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ 3డీ కర్వ్డ్ స్క్రీన్, పీఓఎల్ఈడీ ప్యానెల్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

ప్రాసెసర్: Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.3 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ర్యామ్ బూస్ట్ టెక్నాలజీతో 24జిబి వరకు ర్యామ్‌ను పెంచుకునే వీలుంది.

కెమెరా: Moto G85 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: Moto G85 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Moto G85 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది. 4 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్ ఈ ఫోన్ కి లభిస్తాయి.

కనెక్టివిటీ: Moto G85 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.1, 5GHz వై-ఫై, 13 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.

Previous articleLava Blaze X: 64ఎంపి కెమెరాతో భారత్‌లో లాంచైన లావా బ్లేజ్ ఎక్స్
Next articleMoto G85 vs Realme P1 Pro: దేనిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుసుకుందాం
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.