Home News Moto G85 5G: బీఐఎస్, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్స్ పొందిన మోటో జీ85 5జీ

Moto G85 5G: బీఐఎస్, టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్స్ పొందిన మోటో జీ85 5జీ

Highlights
  • త్వరలో Moto G85 5G లాంచ్
  • మోడల్ నంబర్ Moto XT2427-3
  • 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola త్వరలో జీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. అలాగే మరొక సర్టిఫికేషన్ సైట్ టీఈఎన్ఏఏ పై కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Moto G85 5G బీఐఎస్, టీఈఎన్ఏఏ లిస్టింగ్స్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ బీఐఎస్ వెబ్‌సైట్ పై Moto XT 2427-3 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Moto G85 5G డివైజ్ టీఈఎన్ఏఏ సర్టిఫికేషన్ సైట్ పై XT2427-4 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ సర్టిఫికేషన్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. అయితే త్వరలోనే భారత్ లో లాంచ్ ఉంటుందని చెప్పవచ్చు.

Moto G85 5G యొక్క TENAA సర్టిఫికేషన్ ద్వారా 6.6-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్ హెచ్డీ+ (1080*2400 పిక్సెల్స్) రెజుల్యూషన్, 2.3 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ రివీల్ అయ్యాయి. గతంలో ఈ ఫోన్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. ఆ లిస్టింగ్ ద్వారా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్ రివీల్ అయ్యింది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 4850 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఇంకా ఈ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

భద్రత కోసం ఈ ఫోన్ లో ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఇంకా ఈ ఫఓన్ 8జిబి/12జిబి/16జిబి/18జిబి ర్యామ్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. స్టోరేజీ విషయానికి వస్తే, ఈ ఫోన్ 128జిబి/256జిబి/512జిబి/1టిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.