గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022: ధర, స్పెసిఫికేషన్స్

హైలైట్స్

  • ఇటీవలె చైనాలో లాంచ్ అయిన Moto Razr 2022 ఫోల్డబుల్ ఫోన్
  • తాజాగా యురొపియన్ మార్కెట్ లో లాంచ్ అయిన Moto Razr 2022
  • త్వరలో భారత్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న Moto Razr 2022

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా ఇటీవలె తన నెక్ట్స్ జనరేషన్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు మోటోరోలా అధికారికంగా అంతర్జాతీయ మార్కెట్ లో Moto Razr 2022 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ యురోపియన్ మార్కెట్ లో విడుదలైంది. అయితే ఇంకా భారత లాంచ్ తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే మోటోరోలా ఈ సమాచారాన్ని వెల్లడించే అవకాశం ఉంది.

Moto Razr 2022 ధర

Moto Razr 2022 ఐరోపా దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 1200 యూరోలు (సుమారు రూ.98,500) గా ఉంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ వేరియంట్ లో లభించనుంది.

Moto Razr 2022 స్పెసిఫికేషన్స్

Moto Razr 2022 స్మార్ట్ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2.7-ఇంచ్ ఓఎల్ఈడీ కవర్ స్క్రీన్ ఉన్నాయి. ఈ కవర్ స్క్రీన్ ద్వారా దాదాపు అన్ని ఫంక్షన్స్ ని ఫోన్ ని తెరవకుండానే జరపవచ్చు. Moto Razr 2022 లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్ వాడారు. 8జిబి/128జిబి, 12జిబి/256, 18జిబి/512 ర్యామ్ మరియు స్టోరేజీ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Moto Razr 2022 స్మార్ట్ ఫోన్ లో 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫిజికల్ సిమ్ స్లాట్ కాకుండా ఈ ఫోన్ లో ఈ-సిమ్ సౌకర్యం కూడా ఉంది. ఐపీ52 రేటింగ్, డ్యూయల్ స్పీకర్స్, డాల్బి అట్మాస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇకపోతే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇప్పుడు Moto Razr 2022 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Moto Razr 2022 లో ఓఐఎస్ తో కూడిన 50 మెగాపిక్సెల్ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. ఇంకా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు సెంటర్డ్ పంచ్ హోల్ లో 32ఎంపి కెమెరా ఉంది.

రూమర్లు నిజమైతే కనుక, త్వరలోనే Moto Razr 2022 భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. ఒకవేళ లాంచ్ అయితే, ఇటీవలె మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 కి గట్టి పోటీ ఇవ్వనుంది. రెండు డివైజెస్ కూడా దాదాపు ఒకే విధమైన డిజైన్, స్పెసిఫికేషన్స్ ని కలిగి ఉన్నాయి. అయితే భారత మార్కెట్ లో Moto Razr 2022 ఫోన్ ని ఎంత ధరతో లాంచ్ చేస్తారో చూడాలి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articleత్వరలో లాంచ్ కానున్న Samsung Galaxy F04s
Next articleలాంచ్ అయిన OnePlus Ace Pro Genshin Impact ఎడిషన్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.