మోటోరోలా కంపెనీ లాంచ్ చేయబోయే రెండు ఫోల్డబుల్ ఫోన్ల గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట్లో హడావుడి కొనసాగుతోంది. జులై 3 న Moto Razr 40, Moto Razr 40 Ultra ఫోన్లు భారత్ లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోల్డబుల్ ఫోన్లు శాంసంగ్ మరియు ఒప్పో మడతబెట్టే ఫోన్లకు గట్టి పోటీ ఇస్తాయని భావిస్తున్నారు. మీకు గనుక Moto Razr 40, Moto Razr 40 Ultra వివరాలు కావాలంటే ఇక్కడ అందిస్తున్నాం. ఓసారి చదివి తెలుసుకోండి.
Moto Razr 40 సిరీస్ ధర (లీక్)
Moto Razr 40, Moto Razr 40 Ultra ధరలు ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఇండియా పై కనిపించాయి. Moto Razr 40 ధర రూ.59,999 గా ఉంది. మరోవైపు Moto Razr 40 Ultra ధర రూ.75,000 గా ఉంది.
Moto Razr 40 స్పెసిఫికేషన్స్
- డిస్ప్లే: Moto Razr 40 ఫోల్డబుల్ ఫోన్ లో 6.9-ఇంచ్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2640*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.47-ఇంచ్ కవర్ డిస్ప్లే, ఓఎల్ఈడీ ప్యానెల్, 194*368 పిక్సెల్ రెజుల్యూషన్ ఉంటాయి.
- ప్రాసెసర్: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.
- స్టోరేజీ: Moto Razr 40 డివైజ్ 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ ఆప్షన్ లో లభిస్తుంది.
- బ్యాటరీ: Moto Razr 40 లో పవర్ బ్యాకప్ కోసం 4200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 5 వాట్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది.
- కెమెరా: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ 64ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి కెమెరా ఉంటుంది.
- ఓఎస్: Moto Razr 40 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
