
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Motorola తాజాగా తన హోమ్ మార్కెట్ చైనాలో Moto S50 Neo డివైజ్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో కర్వ్డ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12జిబి ర్యామ్, 1600 నిట్స్ బ్రైట్నెస్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Moto S50 Neo ధర
Moto S50 Neo స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.
Moto S50 Neo యొక్క 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ధరను 1399 యువాన్లు (సుమారు రూ.16,000) గా నిర్ణయించారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 1599 యువాన్లు (సుమారు రూ.18,300) గా ఉంది.
Moto S50 Neo 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ టాప్ వేరియంట్ ధరను 1899 యువాన్లు (సుమారు రూ.21,800) గా నిర్ణయించారు.
Moto S50 Neo స్మార్ట్‌ఫోన్ నియో గ్రే, ఆలివైన్, సర్ఫ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. పాంటోన్ భాగస్వామ్యంతో ఈ రంగులను మోటోరోలా రూపొందించింది.
జూన్ 28వ తేదీ నుంచి చైనాలో Moto S50 Neo యొక్క ప్రీ-ఆర్డర్స్ మొదలవుతాయి. ఇండియాలో ఈ ఫోన్ మోటోరోలా జీ85 5జీ పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సరే, ఓసారి మోటో ఎస్50 నియో యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Moto S50 Neo స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Moto S50 Neo లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, 10-బిట్ పీఓఎల్ఈడీ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Moto S50 Neo లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 619 జీపీయూ ఉన్నాయి. ఈ చిప్ 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Moto S50 Neo డివైజ్ 8జిబి/12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా: Moto S50 Neo లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ మ్యాక్రో/డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ: Moto S50 Neo లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 30 వాట్ టర్బో చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Moto S50 Neo డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత మైయూఎక్స్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
బరువు, చుట్టుకొలత: Moto S50 Neo డివైజ్ 161.91 మి.మీ పొడవు, 74.06 మి.మీ వెడల్పు, 7.59 మి.మీ మందం, 173 గ్రాముల బరువు ఉంటుంది.











