18GB ర్యామ్, 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోన్న Moto X40

హైలైట్స్

  • Moto X40 ఐపీ68 రేటింగ్ తో వస్తున్నట్లు ప్రకటించిన లెనొవో ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్
  • ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం
  • డిసెంబర్ లో లాంచ్ కానున్న మోటోరోలా Moto X40 స్మార్ట్ ఫోన్

Motorola Moto X40 లాంచ్ తేదీ త్వరలోనే ప్రకటించబడనుంది. తన తదుపరి ఫ్లాగ్షిప్ డివైజ్ రాకకు సంబంధించిన ప్రకటనను మోటోరోలా త్వరలో అనౌన్స్ చేయనుంది. లెనొవొ ఎగ్జిక్యూటివ్ చెన్ జిన్ చైనీస్ సామాజిక మాధ్యమం వీబో ద్వారా Motorola Moto X40 కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను వెల్లడించారు. Moto X40 స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, ఐపీ68 రేటింగ్ తో రానుందని ఆయన చెప్పారు. ఈ నెల మొదట్లో TENAA లిస్టింగ్ ద్వారా ఈ డివైజ్ యొక్క ప్రధాన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి.

ITHome ప్రచురించిన కథనాన్ని బట్టి, జిన్ తన వీబో పోస్ట్ పై ఈ విధంగా స్పందించారు. “Motorola Moto X40 ఐపీ68 రేటింగ్ వాటర్ ప్రూఫింగ్ తో వస్తోంది. ఈ డివైజ్ ని మొబైల్ ఫోన్స్ లో ఎస్‌యూవీ అని మేం పిలుస్తున్నాం. డిసెంబర్, గెట్ రెడీ టు గో!”

Motorola Moto X40 స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

Motorola Moto X40 6.67-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1080*2400 రెజుల్యూషన్, 10-బిట్ కలర్, అండర్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తోంది. ఈ ఫోన్ 161.3 మిల్లీ మీటర్ల పొడవు, 73.9 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.5 మిల్లీ మీటర్ల మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది. Moto X40 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తోంది.

Motorola Moto X40 కెమెరా విభాగం చూస్తే, ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి + 50ఎంపి + 12ఎంపి సెన్సర్స్ ఉంటాయి. 4X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.

Moto X40 ఐపీ68 రేటింగ్ తో వస్తోంది. అంటే వాటర్ మరియు డస్ట్ నుంచి ఫోన్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. స్వచ్ఛమైన వాటర్ లో 1.5 మీటర్ల లోతు వద్ద 30 నిమిషాల వరకు ఉన్నప్పటికీ ఈ ఫోన్ కి ఏమీ కాదు. ఇక డస్ట్ రెసిస్టన్స్ కూడా ఉండటం వల్లన ఫోన్ కి అదనంగా కేసెస్, కవర్స్ అక్కర్లేదు.

Moto X40 స్మార్ట్ ఫోన్ 4950 ఎంఏహెచ్ బ్యాటరీ లేదా 4450 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది. ఇక ర్యామ్, స్టోరేజీ విషయానికి వస్తే, ఈ డివైజ్ 8జిబి, 12జిబి మరియు 18జిబి ర్యామ్.. 128జిబి, 256జిబి మరియు 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ తో రానున్నట్లు సమాచారం.

Moto X40 AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్

ఇటీవలె జిన్ Moto X40 యొక్క AnTuTu బెంచ్ మార్క్ ని షేర్ చేశారు. దాని ద్వారా క్వాల్కమ్ ఫ్లాగ్షిప్ నుంచి ఏం ఆశించవచ్చో తెలిసింది. 1,312,901 స్కోర్ ని నమోదు చేసి వారెవా అనిపించింది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.

Previous articlePrime Video లో స్ట్రీమ్ అవుతోన్న మాస్ మహారాజా సినిమాలు
Next articleOPPO K10 5G స్మార్ట్‌ఫోన్ పై భారీ డిస్కౌంట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.