Home News Snapdragon 8 Gen 2 తో వస్తున్న Moto X40; ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం

Snapdragon 8 Gen 2 తో వస్తున్న Moto X40; ఈ ఏడాది చివర్లో లాంచ్ అయ్యే అవకాశం

హైలైట్స్

Moto Edge 30 సిరీస్ తో ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో Motorola బాగానే బజ్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా లాంచ్ తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ ఫోన్ 200 మెగాపిక్సెల్ సెన్సర్ తో రావడం విశేషం. అయితే, రానున్న ఒకట్రెండు నెలల్లో ఈ 30 సిరీస్ కి అప్‌గ్రేడ్ వర్షన్ మోటో ఎడ్జ్ 40 సిరీస్ ఎంట్రీ ఇవ్వనుందని తాజా సమాచారం. త్వరలోనే మోటోరోలా కంపెనీ Moto X40 సిరీస్ ని లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Moto X40 (Moto Edge 40 Pro) స్పెసిఫికేషన్స్

చైనాకు చెందిన ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వీబో ద్వారా Moto X40 కి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. డిజిటల్ చాట్ స్టేషన్ చెబుతున్న దాన్ని బట్టి, Moto X40 ఒకట్రెండు నెలల్లో చైనాలో లాంచ్ అవ్వబోతోంది. చిప్ తయారీ సంస్థ క్వాల్కమ్ తన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ చిప్ Snapdragon 8 Gen 2 ని లాంచ్ చేసిన తర్వాత Moto X40 ఇదే చిప్సెట్ తో మార్కెట్ లోకి ప్రవేశించనుంది.

క్వాల్కమ్ తీసుకొస్తున్న నెక్ట్స్ జనరేషన్ చిప్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 తో రానున్న తొలి ఫోన్ గా Moto X40 నిలవనుంది. అయితే, ఇదొక్కటే కాదండోయ్, ఇంకా ఐకూ 11, వన్‌ప్లస్ 11 ప్రో, శాంసంగ్ గెలాక్సీ 23 సిరీస్ ఫోన్లు కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తున్నాయి. ఇక శాంసంగ్ గెలాక్సీ 23 సిరీస్ 2023 ఆరంభంలో లాంచ్ అవుతోంది.

రిపోర్ట్ ప్రకారం, Moto X40 స్మార్ట్ ఫోన్ హయ్యర్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 50 మెగా పిక్సెల్ కెమెరా, 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది. అయితే ఇవి బేస్ వర్షన్ యొక్క స్పెసిఫికేషన్స్ అని గమనించాలి. ఇంకా అల్ట్రా వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్స్ వేరేలా ఉండనున్నాయి. గ్లోబల్ గా Moto X40 స్మార్ట్ ఫోన్, Moto Edge 40 Pro అనే పేరుతో లాంచ్ అవ్వనుంది. మోటో ఎక్స్30 కూడా ఇదే విధంగా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.

రానున్న వారాల్లో Moto X40 లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్స్ కి సంబంధించిన వివరాలు తెలుస్తాయి.

ఓసారి Moto X30 స్పెసిఫికేషన్స్ పై లుక్ వేద్దాం పదండి. ఈ ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 576హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఈ ఫోన్ లో 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఉన్నాయి. ఇందులో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మోటో ఎక్స్30 లో 60 మెగా పిక్సెల్ ఫ్రంట్ షూటర్ ఉండటం విశేషం. ఇకపోతే పవర్ బ్యాకప్ కోసం ఈ ఫోన్ లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 68 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.