Home News లాంచ్ కి ముందు రివీల్ అయిన Motorola Devon 5G స్పెసిఫికేషన్స్, డిజైన్

లాంచ్ కి ముందు రివీల్ అయిన Motorola Devon 5G స్పెసిఫికేషన్స్, డిజైన్

హైలైట్స్:

Motorola Devon 5G స్పెసిఫికేషన్స్, రెండర్ ఇమేజ్ 91మొబైల్స్ ద్వారా రివీల్ అయ్యియి. ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి ద్వారా ఈ సమాచారం అందింది. ఇది వరకు డెవన్ ఫోన్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదొక 4జీ లో-మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని, స్నాప్ డ్రాగన్ 680 చిప్ తో వస్తుందని అనుకున్నారు. గత నెలలో ఈ డివైజ్ Moto G32 అనే పేరుతో లాంచ్ అయ్యింది. డెవన్ యొక్క 5జీ వేరియంట్ కూడా త్వరలోనే లాంచ్ కానుంది. పైన చూపబడిన ఇమేజ్ మాదిరి ఆ ఫోన్ ఉంటుంది.

Motorola Devon 5G డిజైన్, స్పెసిఫికేషన్స్

పైన కనిపిస్తోన్న రెండర్ ఇమేజ్ ని బట్టి చూస్తే, Motorola Devon 5G ఫోన్ డిజైన్ Moto G32 4G ఫోన్ లాగా ఉన్నట్లు తెలుస్తోంది. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, రెక్టాంగ్యులర్ రియర్ కెమెరా మాడ్యూల్ ని ఇమేజ్ లో మనం గమనించవ్చు. రియర్ కెమెరా మాడ్యూల్ లో మూడు సెన్సర్స్ ఉండనున్నాయి. ఇందులో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ లెన్స్, 2 మెగా పిక్సెల్ మ్యాక్రో లెన్స్, 2 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపున 16 మెగా పిక్సెల్ కెమెరా ఉండనుంది.

Motorola Devon 5G స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ 5జీ చిప్సెట్ తో రానుంది. అయితే ఆ ప్రాసెసర్ పేరేంటో ఇంకా తెలియదు. త్వరలోనే ఈ విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది. 4జిబి ర్యామ్ మరియు 6జిబి ర్యామ్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభించనుంది. మోటోరోలా జీ32 4జీ డైమెన్షన్స్ లాగే ఈ ఫోన్ అమరిక ఉంటే కనుక, 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 1080*2400 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉండనుంది. ఇప్పటికి Motorola Devon 5G గురించి మాకు తెలిసిన సమాచారం ఇంతే. త్వరలోనే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే 4జీ వర్షన్ విడుదల అయ్యింది కనుక, ఏ క్షణమైనా మోటోరోలా కంపెనీ Motorola Devon 5G స్మార్ట్ ఫోన్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది ముగిసే లోపు Motorola Devon 5G కి సంబంధించిన లాంచ్ ప్రకటన వస్తుందని అంచనా వేయవచ్చు. అప్పుడే పేరు యొక్క అసలైన మార్కెటింగ్ పేరు తెలుస్తుంది. మోటోరోలా ఈ ఫోన్ ని సింపుల్ గా Moto G32 5G అని పిలుస్తుందని మేం భావిస్తున్నాం.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.