ప్రముఖ టెక్ బ్రాండ్ Motorola లో-బడ్జెట్ లో Moto E13 ఫోన్ ని 2023 ఆరంభంలో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ 3 స్టోరేజీ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.8,999 గా ఉంది. అయితే తాజాగా పండుగ ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ.6,749 కే లభిస్తోంది. సరే, ఓసారి Moto E13 డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.
Moto E13 ధర, కొత్త కలర్ ఆప్షన్
Indulge in seamless performance & unlock advanced features, courtesy of the 8GB RAM & generous 128GB storage in the all-new #motoe13. Elevate your style with the stunning 'Sky Blue' shade. Buy now exclusively on @flipkart, https://t.co/azcEfy2uaW & at leading retail destinations.
— Motorola India (@motorolaindia) September 28, 2023
- మోటోరోలా కంపెనీ చవకైన స్మార్ట్ ఫోన్ Moto E13 ని కొత్త స్కై బ్లూ కలర్ ఆప్షన్ లో లాంచ్ చేసింది.
- డివైజ్ ధర రూ.8,999 గా ఉంది. అయితే యాక్సిస్, ఐసీఐసీఐ, కొటక్ బ్యాంక్ ద్వారా 10 శాతం డిస్కౌంట్ లభించనుంది.
- దీంతో పండుగ ఆఫర్ లో ఈ ఫోన్ ధర రూ.6,749 కి చేరినట్లయింది.
- నేటి నుంచి Moto E13 సేల్ మొదలైంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఫోన్ ని మీరు కొనుగోలు చేయవచ్చు.
- 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఆప్షన్ లో ఈ ఫోన్ లభిస్తుంది.
Moto E13 స్పెసిఫికేషన్స్
- స్క్రీన్: Moto E13 స్మార్ట్ఫోన్ లో 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, 720*1600 పిక్సెల్ రెజుల్యూషన్, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
- ప్రాసెసర్: Moto E13 లో యూనిఎస్ఓసీ టీ606 చిప్ వాడారు. ఇది 2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ57 ఎంసీ2 జీపీయూ వినియోగించారు.
- మెమొరీ: Moto E13 లో 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.
- కెమెరా: Moto E13 లో 13ఎంపి ప్రైమరీ లెన్స్ ఉంది. ఈ ఫోన్ లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 5ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
- బ్యాటరీ: Moto E13 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 10 వాట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
- బరువు, చుట్టుకొలత: Moto E13 డివైజ్ 164.19 మి.మీ పొడవు, 74.95 మి.మీ వెడల్పు, 8.47 మి.మీ మందం, 179.5 గ్రాముల బరువు ఉంటుంది.
- ఇతర ఫీచర్లు: Moto E13 లో డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్, ఐపీ52 రేటింగ్ ఉన్నాయి.
