హైలైట్స్:
- భారత్ లో బీఐఎస్ సర్టిఫికేషన్ పొందిన మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్
- మోటో ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ కలిగిన హ్యాండ్సెట్
- స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 50ఎంపి ప్రైమరీ కెమెరా ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
ప్రస్తుతం మోటోరోలా యొక్క ఎడ్జ్ 30 సిరీస్ లో మోటో ఎడ్జ్ 30 మరియు మోటో ఎడ్జ్ 30 ప్రో అనే రెండు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోటో ఎడ్జ్ 30 అల్ట్రా అనే ఫోన్ ని లాంచ్ చేసేందుకు మోటోరోలా కంపెనీ సిద్ధమవుతోంది. ప్రపంచపు మొట్టమొదటి 200ఎంపి కెమెరా ఫోన్ గా ఇది పరిగణించబడుతోంది. ఈలోపు మోటోరోలా మోటో-ఎక్స్‌టీ-2243-1 అనే మోడల్ నంబర్ తో ఉన్న మరొక ఫోన్ కి బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. ఇది మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్ అయి ఉంటుందని అందరూ అంచానా వేస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్ భారత్ లో లాంచ్ కానున్నట్లు సమాచారం.
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది.
BIS సర్టిఫికేషన్
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎక్స్‌టీ2243-1 అనే మోడల్ నంబర్ పై బీఐఎస్ సర్టిఫికేషన్ పొందింది. దీన్ని బట్టి అతి త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. అయితే, లిస్టింగ్ ద్వారా పెద్దగా హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ఏమీ తెలియలేదు. అయితే ఎడ్జ్ 30 యొక్క స్టాండర్డ్ వేరియంట్ గా ఫ్యూజన్ ని రంగంలోకి దించొచ్చని మనం అంచనా వేయొచ్చు.
Moto Edge 30 Fusion స్పెసిఫికేషన్స్ (అంచనా)
చైనాలో మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎస్30 అనే పేరుతో లాంచ్ కానుందని సమాచారం. ఇదే కనుక నిజమైతే, ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888+ చిప్సెట్, 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీ, 4,400ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ కస్టమ్ స్కిన్, 50ఎంపి ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో కెమెరా వంటి ఫీచర్లను కలిగి ఉండనుంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 32ఎంపి కెమెరాను అందించనున్నారు. 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్ 10+ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉంటాయని అంచనా. ఇవి రూమర్ల ఆధారంగా చెప్పబడిన స్పెసిఫికేషన్స్, కాగా, త్వరలోనే లాంచ్ అయ్యే ఫోన్ యొక్క అసలైన స్పెసిఫికేషన్స్ వేరుగా ఉండే అవకాశముంది.
మోటోరోలా ఎడ్జ్ 30 ఫ్యూజన్ లాంచ్ అయ్యాక, మోటో ఎడ్జ్ 30 ప్రో ఫోన్ కి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ధర కూడా దాదాపు అదే రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇది కేవలం అంచనా మాత్రమే. వాస్తవంలో ఫోన్ లాంచ్ అయ్యాక గానీ, ఏ విషయం చెప్పలేం. కానీ, ఇప్పుడు ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్ గా ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఎంట్రీ ఇవ్వనుందని చెప్పవచ్చు.













