Home News గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo

గీక్‌బెంచ్ పై కనిపించిన Motorola Edge 30 Neo

హైలైట్స్:

తన మోటో ఎడ్జ్ 30 సిరీస్ ను మరింత విస్తృతం చేయాలని మోటోరోలా భావిస్తున్నట్లు అర్థమవుతోంది. రీసెంట్ గా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా విషయంలో పలు కథనాలు వచ్చాయి. వాటిని బట్టి, ఎడ్జ్ 30 అల్ట్రా 200ఎంపి కెమెరాతో వస్తోందని తెలుస్తోంది. ఈలోపే మరొక డివైజ్ గురించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. అదే మోటోరోలా ఎడ్జ్ 30 నియో. ఇప్పుడు ఇదే ఫోన్ బెంచ్ మార్కింగ్ సైట్, గీక్ బెంచ్ లో కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.

మైస్మార్ట్‌ప్రైస్ తొలుత గీక్ బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో ఫోన్ ని గుర్తించింది. ఈ ఫోన్ సింగిల్ కోర్ టెస్ట్ లో 664 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్ లో 1848 పాయింట్లను సాధించింది.

Motorola Edge 30 Neo ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ గీక్‌బెంచ్ పై మోటోరోలా ఎడ్జ్ 30 నియో దర్శనమిచ్చింది. ఈ లిస్టింగ్ లో ఫోన్ కి సంబంధించిన కీలక ఫీచర్లైన ఓఎస్ వర్షన్, ర్యామ్, చిప్సెట్ కనిపించాయి. మోటో ఎడ్జ్ 30 నియో ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. మయామీ అనే కోడ్ నేమ్ తో మోటో ఎడ్జ్ 30 నియో యొక్క మదర్‌బోర్డ్ సెక్షన్ మెన్షన్ చేయబడి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్ అయి ఉండొచ్చని అంచనా.

అంతకు ముందు, ట్విట్టర్ యూజర్ నీల్స్ అహ్రెన్స్మెయిర్ మోటో ఎడ్జ్ 30 నియో ధర 399 యూరోలు (దాదాపు రూ.32,000) ఉంటుందని వెల్లడించాడు. ఎడ్జ్ 30 లైట్ యొక్క రీబ్రాండెడ్ వర్షన్ గా 30 నియో వస్తుందని చెప్పాడు. అదే కనుక నిజమైతే, ఇటీవలె ఆన్ లైన్లో కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. వాటి ఆధారంగా, ఎడ్జ్ 30 నియో లో 6.5 అంగుళాల డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్, 64ఎంపి కెమెరా (ఓఐఎస్), 4020ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. రూమర్ల ఆధారంగా ఈ ఫీచర్లను అంచనా వేస్తున్నాం. ఇవే నిజమని కచ్చితంగా చెప్పలేం.

మోటోరోలా ఎడ్జ్ 30 నియో 64ఎంపి ప్రైమరీ కెమెరాను కలిగి ఉండే అవకాశముందని  తెలుస్తోంది. ఈ కెమెరా ఓఐఎస్ ఫీచర్ తో వస్తోంది. ఇప్పటి వరకు ఎడ్జ్ 30 నియో గురించి అనుకున్న ఫీచర్లను (అంచనా) బట్టి ఫోన్ ధర రూ.32,000 అంటే చాలా ఎక్కువనే చెప్పాలి. స్నాప్ డ్రాగన్ 695 లేదా స్నాప్ డ్రాగన్ 750జి చిప్సెట్స్ కి అంత ధర పెట్టడమంటే సరికాదు. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే, 64ఎంపి ఓఐఎస్ కెమెరా. ఈ ఒక్క ఫీచర్ ని సెల్లింగ్ పాయింట్ గా భావించి మార్కెట్ లోకి వెళ్తే దెబ్బపడే అవకాశముంది. కాస్త ధరను తగ్గిస్తే, యూజర్లు ఈ ఫోన్ పై కన్నేసే అవకాశముంది. త్వరలోనే మోటోరోలా ఎడ్జ్ 30 నియో కి సంబంధించిన అధికార ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.