Home News లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra

లాంచ్ అయిన ప్రపంచపు తొలి 200MP కెమెరా ఫోన్ Moto Edge 30 Ultra

హైలైట్స్:

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటోరోలా మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ ని గ్లోబల్ గా లాంచ్ చేసింది. దీంతో పాటు మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 30 నియో కూడా లాంచ్ అయ్యాయి. గత నెలలో చైనాలో లాంచ్ అయిన మోటోరోలా ఎక్స్30 ప్రో యొక్క రీబ్రాండ్ వర్షన్ ఈ Moto Edge 30 Ultra. ఈ ఫోన్ ప్రపంచపు తొలి 200ఎంపి కెమెరా ఫోన్. ఇది శాంసంగ్ తయారు చేసిన 200 ఎంపి లెన్స్. హ్యాండ్సెట్ విషయానికి వస్తే, ఇది పంచ్-హోల్ కటౌట్ తో వస్తోంది. కర్వ్డ్ ఎడ్జెస్, అల్యూమినియమ్ ఫ్రేమ్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వంటివి ఇందులో ఉన్నాయి.

సెప్టెంబర్ 13 న మోటో ఎడ్జ్ 30 అల్ట్రా ఫోన్ భారత్ లో లాంచ్ అవుతుందని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశాడు. అసలైతే, మోటోరోలా ఈ వారంలో భారత్ లో ఓ ఈవెంట్ నిర్వహించాల్సింది. కానీ, ఎందుకో వాయిదా పడింది. మోటోరోలా ఇంకా లాంచ్ తేదీని వెల్లడించాల్సి ఉంది.

 

Moto Edge 30 Ultra ధర

Moto Edge 30 Ultra ధర 899.99 యూరోలు (దాదాపు రూ.72,900) గా ఉంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో లభ్యమవుతుంది. అవి: స్టార్‌లైట్ వైట్ మరియు ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్.

Moto Edge 30 Ultra స్పెసిఫికేషన్స్

Moto Edge 30 Ultra 6.67 అంగుళాల ఫుల్-హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1250 నిట్స్ బ్రైట్నెస్, డీసీ డిమ్మింగ్, 1500 హెర్ట్జ్ ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్, 100 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గేముత్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, మైయూఎక్స్ 4.0 కస్టమ్ స్కిన్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Moto Edge 30 Ultra లో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనకాల ఎల్ఈడీ ఫ్లాష్ అందించారు. ఇక 200ఎంపి ప్రైమరీ శాంసంగ్ ఐసోసెల్ హెచ్పీ1 సెన్సర్ ఉంది. ఇది ఓఐఎస్ ని కలిగి ఉంది. 50 ఎంపి అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 12 ఎంపి టెలీఫోటో 2ఎక్స్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 60ఎంపి కెమెరా ఉంది.

Moto Edge 30 Ultra లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 5జీ, 4జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎల్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, ట్రిపుల్ మైక్రోఫోన్ అర్రే, ఐపీ52 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ వార్తల కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.